మోడీని అవమానించారంటూ కేసీఆర్ పై ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా కొత్త పద్ధతి ఒకటి తరచూ కనిపిస్తూ ఉండేది. మాటల్లో ఏ మాత్రం తేడా దొర్లినా.. వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే ధోరణి గులాబీ నేతల్లో ఎక్కువగా కనిపించేది. ఈ ఫిర్యాదులతో పలువురు నేతలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారు.
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. కాకుంటే.. ఫిర్యాదులు ఇచ్చే వారు ఎక్కువగా తెలంగాణ అధికారపక్షానికి చెందిన వారో.. లేక ఆ పార్టీ అనుబంధం సంఘాలు.. మద్దతుదారులే ఎక్కువగా ఉంటారన్న పేరుంది. తాజాగా గులాబీనేతల అలవాటును తెలంగాణ బీజేపీ నేతలు అందిపుచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రధాని నరేంద్రమోడీని కించపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హైదరాబాద్ లో ఒక ఫిర్యాదు పోలీసులకు అందింది. ప్రధాని మోడీని ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని.. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలంటూ మొఘల్ పురా పోలీస్ స్టేషన్ కు తాజాగా ఒక ఫిర్యాదు అందింది.
బీజేపీ మైనార్టీ విభాగమైన బీజేపీ మైనార్టీ మొర్చా ఉపాధ్యక్షుడు.. న్యాయవాది ఎంఏ ఖావి అబ్బాసీ మొఘల్ పురా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దేశ ప్రధాని మోడీని ఉద్దేశించి సీఎం ఉపయోగించిన బాష అభ్యంతరకరంగా ఉందని.. ఇది తమ మనోభావాల్ని దెబ్బ తీసిందంటూ ఆయన పోలీస్ స్టేషన్లోఫిర్యాదు చేశారు.
సీఎం చేసిన వ్యాఖ్యలు తనతో పాటు.. బీజేపీ నేతలు పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. ఖండిస్తున్నట్లుగా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి.. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.