పిల్లోడు ఏంది కేసీఆర్.. మేనల్లుడు అంటే బాగుండేదిగా?
మాటలతో మునగచెట్టు ఎక్కించేయొచ్చు. అవే మాటలు కొన్ని సందర్భాల్లో ముల్లు మాదిరి గుచ్చుకునేస్తుంటాయి. అందుకే.. నోటి నుంచి వచ్చే మాటల విషయంలోమహా జాగ్రత్తగా ఉండాలనేది. తాజాగా సిద్దిపేట పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు సిద్ధిపేటవాసుల్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తే.. మాటల మధ్యలో వచ్చిన రెండు.. మూడు మాటలు ఇబ్బందికరంగా మారాయన్న మాట వినిపిస్తోంది.
అందులో ఒకటి.. మంత్రి కమ్ మేనల్లుడు అయిన హరీశ్ ను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్య కూడా ఉందని చెప్పాలి. హరీశ్ ను పొగడటం బాగానే ఉన్నా.. ఆ మాటల్లో ఆయన్ను ‘పిల్లోడి’గా పరిమితం చేయటం మాత్రం కాస్తంత ఆశ్చర్యానికి గురి చేయక మానదు. పిల్లోడు అనే కన్నా.. ‘నా మేనల్లుడు’ అనే మాట అనేసి ఉంటే మరింత అతికినట్లుగా ఉండటమే కాదు.. చాలామంది ఆనందానికి గురయ్యే వారు.
కేసీఆర్ వెంట మొదట్నించి ఉన్న హరీశ్ ను.. కూరలో కరివేపాకు మాదిరి పక్కన పెట్టేశారన్న బాధ.. ఆవేదన టీఆర్ఎస్ లోని చాలామందికి ఉంది. కానీ.. బయటపడరు. తన కొడుకును ప్రమోట్ చేసినంత బాగా హరీశ్ ను చేయరన్న మాట ప్రతి సందర్భంలోనూ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న కంప్లైంట్ చాలామంది గులాబీ క్యాడర్ లో వినిపిస్తూ ఉంటుంది. హరీశ్ హుషారైన నాయకుడని.. గట్టివాడని.. బాగా పనులు చేస్తాడంటూ ఎంత మునగ చెట్టు ఎక్కించేసినా.. చివరకు వచ్చేసరికి.. ‘ఆ పిల్లాడు’ అన్న మాట ముల్లులా గుచ్చుకుంటుందని చెప్పక తప్పదు.
తన కలల్ని నెరవేర్రచి.. తన గుండెలు నిండా సంతోషాన్ని నింపిన హరీశ్ ను ఆశీర్వదిస్తున్నా అన్న మాటల వినేందుకు బాగున్నా.. చేతల విషయానికి వస్తే.. ఆయన్ను ఆరో వేలిగా పరిమితం చేయటాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు. పిల్లోడు స్థానే.. మేనల్లుడన్న మాట మరింత అతికినట్లుగా ఉండటమే కాదు.. ఆయన నోటి నుంచి వచ్చే మాట అంతో ఇంతో సంతోషానికి గురి చేసేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.