అమ‌రావ‌తిః ఇంకో హాట్ అప్‌ డేట్‌

Update: 2016-05-03 13:34 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతి ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. తాత్కాలిక స‌చివాల‌యం - నూత‌న రోడ్ల‌తో ఇటీవ‌ల ప‌తాక శీర్షిక‌ల‌ను ఆక‌ర్షించిన ఆంధ్రుల రాజ‌ధాని ఇపుడు కొత్త విష‌యంతో మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే రాజ‌ధాని డిజైన్ల మార్పు.

ఇప్పటివరకూ రాజధాని అమరావతికోసం చేసిన పని అంతా ఒక ఎత్తు, ఇకముందు జరిగేది మరో ఎత్తు అని తెలుస్తోంది. తాజాగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అత్యుత్తమ రాజధానిని నిర్మించేందుకు ప్రపంచం మెచ్చే డిజైన్లను తయారుచేసే ఆర్కిటెక్ట్‌ లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యామని చెప్పారు. ఈ డిజైన్లను జ్యూరీ ఎంపిక చేస్తుందన్నారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించి ఆకృతిలో మార్పులు చేసి తుదిరూపు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

తన నివాసం నుంచి క్యాపిటల్ సిటీ ఆర్కిటెక్చర్ అడ్వైజరీ కమిటీతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించి విభాగాల వారీగా నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tags:    

Similar News