చంద్రబాబు ద్వంద్వ నీతి..

Update: 2021-05-12 15:54 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు ద్వంద్వ నీతి పాటిస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా అంతరాయం వల్ల 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు, టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. రుయా మరణాలకు సీఎం జగన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని చంద్రబాబు, లోకేష్ డిమాండ్ చేశారు.

నిజానికి తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావడంతోనే రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పలువురు చనిపోయారు. ఆక్సిజన్ సరఫరా కేంద్రం బాధ్యత. దాన్ని జగన్ పై అప్లై చేసి కడిగేస్తున్నారు. తిరుపతి రుయా ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేసిన టీడీపీ ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేయాలని చూస్తోంది.

అయితే గతంలో విజయవాడ రమేశ్ ఆస్పత్రి వ్యవహారంలో ఇదే చంద్రబాబు , టీడీపీ మౌనం దాల్చింది. దీంతోనాడు 10 మంది చనిపోయినా కానీ చంద్రబాబు నోరుమెదపలేదు. ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే ఖండించారు.

అంటే అవసరార్థం చంద్రబాబు రాజకీయం మారిపోతూనే ఉంటోంది. రమేశ్ ఆస్పత్రి విషయంలో ఒకలా.. ఇప్పుుడు రుయా ఆస్పత్రి విషయంలో చంద్రబాబు మరోలా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News