ఆ సంచలనాలు.. ప్రగతి భవన్కే పరిమితం: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మూడు రైతు చట్టాల కోసం ఉద్యమించిన సమయంలో అశువులు బాసిన పంజాబ్ రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున మొత్తం 18 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును పంచిపెట్టడం దారుణమని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులను వదిలేసి.. పంజాబ్ రైతులకు పంపకాలా?.. మైండ్ ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు ప్రభుత్వ సాయం కోసం అల్లాడుతున్నారని, వారిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.
నువ్వు కూడా తగ్గించు!
కేసీఆర్కు ధరల పెరుగుదలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెట్రోల్, డీజిల్పై సెస్ తగ్గించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని కేసీఆర్.. పంజాబ్ రైతులకు డబ్బులు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబంపై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. రాబోయేరోజుల్లో చీదరించుకోవడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రగతి భవన్ ... ప్రజాభవన్‌గా మారుతుందన్నారు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆదుకోవాల్సింది పోయి.. ఎక్కడో పంజాబ్లో చనిపోయిన రైతు కుటుంబాలను కలుస్తున్నాడని మండిపడ్డారు.
అదో పెద్ద జోక్!
కొవిడ్ ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని... ఆ ప్రభావం భారత్పైనే కాదు అమెరికాపై కూడా పడిందన్నారు. ప్రజలపై పెరుగుతున్న పెట్రోభారం తగ్గించేందుకు కేంద్రం ఛార్జీలు తగ్గించిందని... కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెస్ తగ్గించలేదన్నారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్, డీజిల్పై పన్నులు వసూలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్, డీజిల్ తగ్గించారని ప్రచారం చేసుకుంటున్నారని...ఇదో పెద్ద జోక్ అని.. కేసీఆర్ కుటుంబానికి చీదరింపు తప్పదని అన్నారు.
సంచలనాలు అక్కడికే పరిమితం
కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం నిరుపేదల కోసమేనని... కేసీఆర్కు దీనిపై కనీస అవగాహన లేదని కిషన్ రెడ్డి అన్నారు. మొదటి సారి ఎన్నికలప్పుడు చేసిన కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య... హామీ ఏమైందని ప్రశ్నించారు. మాకు కేసీఆర్ సర్టిఫికేట్ అక్కర్లేదని గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తాం అన్నారని... కానీ అవన్నీ ప్రగతి భవన్కే పరిమితం అవుతాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడిని కలిసినా భయపడం!
'రానున్న రోజుల్లో కల్వకుంట్ల ప్రభుత్వానికి చీదరింపు తప్పదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మోడీ మీద ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మరు. ఇక్కడ నమ్మడం లేదని డిల్లీ, పంజాబ్ పోయి అక్కడ రైతులకు సహాయం చేస్తానంటూ... ఇక్కడ తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే దిక్కులేదు కానీ... తగుదునమ్మా అంటూ అక్కడ పర్యటిస్తున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడిని కలిసినా... పాక్ ప్రధానిని కలిసినా మేం భయపడం.`` అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.