హ‌రీష్ బ‌డ్జెట్ ప్ర‌సంగం.. వీడ్కోలు ప్ర‌సంగంలా ఉంది.. కిష‌న్ రెడ్డి ఫైర్‌

Update: 2022-03-08 02:30 GMT
తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ మాటలు కోటలు దాటేలా ఉన్నా... చేతలు మాత్రం అసెంబ్లీ దాటవని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శిం చారు. 8 ఏళ్ల పాలన చూస్తే అది అర్థమవుతుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవని ఆరోపించారు.

75 ఏళ్లలో ఏ రాష్ట్రం కూడా గవర్నర్ను ఈ విధంగా అవమానపర్చలేదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని... ఇది దిగజారుడు, దివాళా కోరుతనమని మండిపడ్డారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడా రు.

గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు జరుపుతున్నందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే వారిని సస్పెండ్ చేశారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో టీఆర్ ఎస్ ఎంపీలు ఉభయసభల్లో ఆందోళన చేసినా కేంద్రం సస్పెండ్ చేయలేద ని గుర్తు చేశారు. ప్రగతి భవన్లో రాసిన సస్పెండ్ తీర్మానం ప్రకారం ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని విమర్శించారు.

అద్భుతంగా బడ్జెట్ ప్రసంగం ఉంది... అప్పులు కూడా చెబితే బాగుండేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ పేరు తీసే అర్హత టీఆర్ ఎస్‌కు లేదని మండిపడ్డారు.

రాజ్యాంగ స్ఫూర్తిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండాల్సింది కాని అది లేదని అన్నారు. గవర్నర్ను అవమానించారని ఆరోపించారు. దళిత బంధుకు కేటాయించిన నిధులతో వచ్చే 15 ఏళ్లైనా దళితులకు మేలు జరగదని విమర్శించారు. టీఆర్ ఎస్‌ నాయకులకు మేలు జరిగేలా దళిత బంధు ఉందని ఎద్దేవా చేశారు.

శాసన సభలో ఈటలను చూడాల్సి వస్తుందనే సభ ప్రారంభమైన 10 నిమిషాలకే సస్పెండ్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా పాలకులు వ్యవహరిస్తున్నప్పుడు ప్రశ్నించే అధికారం తమ సభ్యులకు ఉంటుందని అన్నారు.

బడ్జెట్ ప్రసంగం టీఆర్ ఎస్‌ ప్రభుత్వ వీడ్కోలు ప్రసంగంలా ఉందని చెప్పారు. ఒక సంవత్సరం ముందే వీడుకోలు ప్రసంగంలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కుడా టీఆర్ ఎస్ యేతరులంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారని అన్నారు.

'నూతన రాష్ట్రంలో నూతనంగా ప్రగతి భవన్ మాత్రం నిర్మించుకున్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక ఉస్మానియా ఆసుపత్రి మూతపడింది. బడ్జెట్లో 130 లైన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పెడతానన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదో చెప్పాలి. విశ్వ విద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. ఎంఎంటీఎస్లో రాష్ట్ర వాటా ఎందుకు ఇవ్వలేదు. కేంద్ర పథకాల నిధులు తమ నిధులుగా చూపారు.`` అని కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News