బీజేపీ ఆఫర్.. జగన్, కేసీఆర్ ఏమంటారు?
ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. దేశంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని అర్థమైంది. మెజార్టీ సర్వే సంస్థలు బీజేపీకి పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. అయితే బీజేపీ అధికారంలోకి రావడానికి పూర్తి కారణం హిందీ బెల్టే. ఉత్తర భారతం మొత్తం బీజేపీ వెంట నడవడంతో ఈ గెలుపు సాధ్యమైంది.
బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విందు ఏర్పాటు చేశారట.. మంగళవారం రాత్రి కేంద్రమంత్రులకు ఇచ్చే ఆ పార్టీకి ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరు అవుతున్నారట.. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలు.. మెజార్టీ దృష్ట్యా అమిత్ షా తటస్థ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపినట్టు సమాచారం.
బీజేపీ ఉత్తరాధిన ఎంత ఉవ్వెత్తున గెలిచినా దక్షిణాదిన మాత్రం ఖాతా తెరవడం కష్టమేనని సర్వేలు తేల్చాయి. ఒక్క కర్ణాటకలో సీట్లు తప్పితే.. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు, కేరళలో బీజేపీకి అస్సలు బలం లేదు. సీట్లు రావని తేల్చారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యానే ఈ విందు రాజకీయాలకు ముగ్గురు తటస్థ రాజకీయ పార్టీల అధినేతలను అమిత్ షా పిలిచినట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్, ఒడిషా సీఎం, బిజూ జనతాదల్ అధినేత నవీన్ పట్నాయక్ లను అమిత్ షా వింధు భేటికి ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ ముగ్గురు అటు కాంగ్రెస్ కు, ఇటు బీజేపీకి సమదూరం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిని ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరాదిన బీజేపీ బలపడింది. దక్షిణాదిన మాత్రం ఆ చాన్స్ రావడం లేదు. బలమైన ప్రాంతీయ పార్టీలు తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు, కేరళలో ఉన్నాయి. అందుకే అక్కడ బలపడడం కంటే పొత్తులతో ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకోవడమే బెటర్ అని అమిత్ షా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.. ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడడం అసాధ్యమని నిర్ధారించుకున్నాకే న్యూట్రల్ పార్టీలతో అమిత్ షా విందు రాజకీయంతో స్నేహహస్తం చాచినట్లు అర్థమవుతోంది.
అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే జగన్ మద్దతిస్తానంటున్నారు. ఇక కేసీఆర్ కూడా రాష్ట్ర భవిష్యత్ కు పాటుపడే పార్టీకే మద్దతిచ్చే అవకాశాలుంటాయి. ఇక ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు కూడా ఆప్షన్ లేదు. అందుకే ఈ ముగ్గురికి వారి వారికి కోర్కెలు తీర్చగలిగితే బీజేపీకి మద్దతిస్తారని.. మరింత ధృడంగా తయారు చేయవచ్చని అమిత్ షా ప్లాన్ చేశారట.. చూడాలి మరి ఈ విందు రాజకీయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..