మాటలు జాగ్రత్త.. హెచ్చరించిన కవిత
గ్రేటర్ ఎన్నికల వేళ గులాబీ దండు మొత్తం హైదరాబాద్ లో మోహరించింది. దుబ్బాకలో గెలిచిన బీజేపీలో జీహెచ్ఎంసీలోనూ తొడగొడుతానని అనడంతో టీఆర్ఎస్ సవాల్ గా తీసుకొని హోరాహోరీ తలపడుతోంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది.
తాజాగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కల్వకుంట్ల కవిత జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల గెలుపు బాధ్యతను తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ తాజాగా కేసీఆర్ పై ట్విట్టర్ లో చేసిన కామెంట్లకు కవిత కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య ట్విట్టర్ లో వార్ నడిచింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మాణిక్యం ఠాగూర్ వ్యంగ్యంగా స్పందించారు. ‘అమిత్ షాకు అవసరమైనప్పుడు అంతా మద్దతిస్తారు. రాజ్యసభలో మద్దతిచ్చారు. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం అంటున్నారు. కేంద్రానికి కేసీఆర్ ఏటీఎం లాంటి వాడు’ అంటూ ట్వీట్ చేశారు.
దీనిపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. ‘వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు పోరాడారు. మా ఎంపీలతో మీ వాళ్లు కూడా వచ్చి నిలబడ్డారు. కేసీఆర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి’ అసిన కవిత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.