కేసీఆర్ ను పెట్టి దర్శకేంద్రుడు సినిమా తీయాలన్న కోరిక ఎవరిదంటే?

Update: 2021-01-23 10:30 GMT
పదునునైన వ్యాఖ్యలు.. ముఖం చిన్నబోయేలా పంచ్ లు వేసే వారిలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుంటారు. తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన తీవ్రంగా విరుచుకుపడతారు. బండి మాదిరి కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు గుప్పించిన నేత మరెవరూ లేరన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. అలాంటి ఆయన.. తాజాగా సీన్లోకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును తీసుకొచ్చారు. కేసీఆర్ నటించటంలో జీవిస్తారని.. ఆయనతో రాఘవేంద్రరావు సినిమా తీయాలన్నారు.

కేసీఆర్ ను జోకర్ గా పెట్టి సినిమా తీస్తే సూపర్ మిట్ అవుతుందంటూ వ్యంగ్య వ్యాఖ్య చేసిన ఆయన.. తండ్రీకొడుకులపై మరోసారి విరుచుకుపడ్డారు. కేటీఆర్ ను సీఎం చేయటానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహకరించరన్న ఆయన.. కేటీఆర్ క్యాబినెట్ ఏర్పాటైతే అణుబాంబు పేలటం ఖాయమన్న జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాక్సిన్ వేరే ఉంటోందని.. ప్రదాని మోడీ వ్యాక్సిన్ వేరన్నారు.

అన్ని రాష్ట్రాల్లో ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. ఈ దగుల్బాజీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో తప్ప అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో పేద విద్యార్థులకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహించి.. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. కండకావరంతో రెండేళ్లు నాన్చి ప్రజల్లో వ్యతిరేకత రావటంతో ఈ డబ్లూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నారన్నారు. ప్రకటనలకు పరిమితం కాకుండా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.

ఈడబ్లూఎస్ రిజర్వేషన్ కారణంగా ఎవరి రిజర్వేషన్లు తగ్గవని.. అన్ని కుల సంఘాలు సహకరించాలన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని.. ఆయన్ను సీఎంగా చేసినందుకు తెలంగాణ ప్రజలు దోష నివారణ పూజలు చేయాలన్నారు. అన్ని మాటలు బాగానే ఉన్నా.. సంబంధం లేకుండా దర్శకేంద్రుడ్ని సీన్లోకి తీసుకురావటం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News