జగన్ పై బాలయ్య తీవ్ర విమర్శలు
రాజకీయాల్లో ఉన్నా రాజకీయ నాయకుడిగా వ్యవహరించిన తీరు నటుడు కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణలో తక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యమంత్రి స్వయంగా బావ కమ్ వియ్యంకుడైనా.. తన పనేదో తాను చేసుకుంటూ పోవటం తప్ప తొందరపడి రాజకీయ విమర్శలు చేసింది లేదని చెప్పాలి. కార్యకర్తలు.. అభిమానులు మోతాదు మించిన అభిమానంతో మీదకు వస్తున్న వేళ చిరాకు ప్రదర్శించే బాలయ్య.. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేసింది లేదు.
అలాంటి బాలయ్య తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రశంసల వర్షం కురపించటమే కాదు.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాల్ని ఎక్కుపెట్టారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారన్న ఆయన.. తన విశాఖ పర్యటన సందర్భంగా అభిమానుల్ని.. కార్యకర్తల్ని అలరించే ప్రయత్నం చేశారు.
విశాఖపట్టణంలో తెలుగు యువత కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరైన బాలకృష్ణ.. ఏపీలో ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టటం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం చేస్తున్న కృషికి సాయంగా కూడా నిలవటం లేదంటూ దుయ్యబట్టిన ఆయన.. జగన్ కు 2014 ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేదన్న విమర్శలు చేశారు.
సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయటంలో ఏపీ ముఖ్యమంత్రి దూసుకెళుతున్నట్లుగా అభివర్ణించిన బాలయ్య.. జగన్ తీరును తప్పు పట్టటం.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుడన్న నిర్ణయంపై విమర్శలు చేయటం ఆసక్తికరంగా మారింది. బాలయ్య విమర్శలపై జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన మూడున్నరేళ్లలో జగన్ వర్సెస్ బాలయ్య అన్నట్లుగా విమర్శల సంధించుకున్న దాఖలాలు లేవు. తాజాగా జగన్ పాదయాత్ర నేపథ్యంలో.. విపక్ష నేత తీరును తప్పు పట్టేలా బాలయ్య చేసిన వ్యాఖ్యలకు విపక్ష నేత రియాక్షన్ రాజకీయ ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుందని చెప్పక తప్పదు.