ఆమె మాటలు విని సిబ్బందికి వార్నింగ్ ఇచ్చిన ఏపీ పోలీస్ బాస్

Update: 2020-12-11 03:54 GMT
ఏపీ పోలీసుల తీరుపై ఒక ఎన్జీవో సంస్థకు చెందిన మహిళా ప్రతినిధి మాటలు విన్న ఏపీ డీజీపీ తమ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా.. మహిళా బాధితులకు పోలీస్ స్టేషన్లలో ఎదురవుతున్న ఇబ్బందులు.. చేదు అనుభవాల గురించి ధైర్యంగా చెప్పటం సంచలనంగా మారింది. ఇలా కూడా పోలీసులు మాట్లాడాతరన్న ఆశ్చర్యం వ్యక్తమయ్యేలా ఆమె మాటలు ఉండటం గమనార్హం.

తనను పట్టించుకోకుండా వేరే మహిళతో సహజీవనం చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఒక మహిళ పోలీస్ స్టేషన్ కు వెళితే.. ‘‘నువ్వు కూడా మరొకరితో సహజీవనం చేయొచ్చుగా.. అంటూపోలీసులు ఎగతాళిగా మాట్లాడారు’’ అని చెప్పటంతో పాటు.. మరో ఉదంతంలో భర్త కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళ.. తనకు సాయం చేయాలని కోరితే.. మహిళా పోలీసులు.. ‘ఇదేమైనా మీ పుట్టిల్లా’ అంటూ ఎగతాళిగా మాట్లాడారంటూ చేదు వాస్తవాల్ని ఓపెన్ గా చెప్పేశారు విజయవాడకు చెందిన కీర్తి.

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఏపీ డీజీపీ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్సులో సదరు మహిళ చెప్పిన వివరాల్ని విని ఆశ్చర్యపోయిన ఆయన.. మరోసారి ఆమె చేత అవే మాటల్ని చెప్పింది.. ఇలాంటి తీరును సిబ్బంది మార్చుకోవాలన్నారు. ఒకవేళ.. ఇలాంటివి మరోసారి రిపీట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధిత మహిళలకు పోలీస్ స్టేషన్లు పుట్టిల్లు లాంటివేనని స్పస్టం చేసిన ఆయన.. ఏ కష్టం వచ్చినా మహిళలు పోలీసుల్ని సంప్రదించొచ్చన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు బాధితులు సంప్రదించొచ్చన్నారు.
Tags:    

Similar News