రాజధానులపై వాదనలు..జగన్ ఛాయిస్ రోహత్గీ

Update: 2020-01-22 16:49 GMT
ఏపీలో ఇప్పుడు మూడు రాజధానులపైనే చర్చ. అనుకూలంగా ప్రభుత్వం, వ్యతిరేకంగా విపక్షం. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం లభించినా... శాసనమండలిలో మాత్రం ఆమోదం లభించలేదు. అప్పుడే ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. కోర్టులో తమదైన శైలి వాదనలు వినిపించి మూడు రాజధానులకు బాటలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంటే... ఎలాగైనా అడ్డుకుని తీరాలని విపక్షం భావిస్తోంది. మొత్తంగా హోరాహోరీ పోరే. మరి ఈ పోరులో ఇరువర్గాలు కూడా తమ వాదనలను బలంగానే వినిపించాలని డిసైడ్ అయ్యాయి. ప్రభుత్వ వాదనను ఓ రేంజిలో వినిపించడంతో పాటు అడ్డంకులు రాకుండా చూసేందుకు జగన్ సర్కారు పకడ్బందీ వ్యూహం రచిస్తోంది.

ఈ వ్యూహంలో భాగంగా సుడి తిరిగిన లాయర్ నేే ఎంపిక చేసుకోవాలని జగన్ సర్కారు భావించింది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో మంచి పేరు ఉండటంతో పాటుగా ఆడిటర్ జనరల్ గానూ పనిచేసి సుధీర్ఘ అనుభవం కలిగిన ముకుల్ కోహత్గీని జగన్ సర్కారు ఎంపిక చేసింది. ఏం చేసైనా ప్రభుత్వ వాదనను నెగ్గించాల్సిందేనని రోహత్గీకి చెప్పేసిన జగన్ సర్కారు... ఆయనకు ఫీజుల కింద ఏకంగా రూ.5 కోట్లను కేటాయించేసింది. అంతేకాకుండా ఈ ఫీజులో అడ్వాన్స్ గా రూ.1 కోటిని ఇవ్వాలని కూడా జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆర్డర్స్ కూడా పాసైనట్లు తెలుస్తోంది.

ఈ డీల్ లో భాగంగా రాజధానిపై పలువురు వేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా అన్ని పిటిషన్లపైనా ప్రభుత్వం తరఫున రోహత్గీనే వాదనలు వినిపించాల్సి ఉంది. పేరు మోసిన లాయర్ కపిల్ సిబల్ అంతటి పేరు లేకున్నా... ఆయనకు ఏమాత్రం తీసిపోని రీతిలో వాదనలు వినిపించే సత్తా కలిగిన లాయర్ గా రోహత్గీకి పేరుంది. అంతేకాకుండా ఆడిటర్ జనరల్ గా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వాదనలను కోర్టు ముందు బలంగా వినిపించడంలో రోహత్గీని సాటిరాగల వారు లేరన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి జగన్ సర్కారు నుంచి ఏకంగా రూ.5 కోట్ల మేర ఫీజును తీసుకుంటున్న రోహత్గీ.. జగన్ సర్కారు వాదనను ఏ మేర వినిపిస్తారో చూడాలి.

    
    
    

Similar News