బీజేపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి పోరు.. ఫ‌లితం ఎవ‌రి ఖాతాలోకి?

Update: 2021-08-16 02:54 GMT
ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాల‌పై బీజేపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం క‌లిసి త్వ‌ర‌లోనే ఉద్య‌మం చేస్తుంద‌ని.. ఆ పార్టీ ఉమ్మ‌డిగా ప్ర‌క‌టించిం ది. తాజాగా ఇరు పార్టీల నేత‌లు.. విజ‌య‌వాడ వేదిక‌గా స‌మావేశం నిర్వ‌హించుకున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ స‌హా.. బీజేపీ నుంచి పురందేశ్వ‌రి, సోము వీర్రాజు.. వంటి అగ్ర‌నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా.. ఏపీలో పుంజుకు నేందుకు ఇప్ప‌టి నుంచే పోరాటం చేయాల‌ని.. రోడ్డెక్కాల‌ని.. ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాల‌ని.. జ‌గ‌న్‌పై యుద్ధం ప్ర‌క‌టించాల‌ని.. నాయ‌కులు నిర్ణ‌యించు కున్నారు. ఈ క్ర‌మంలో ఈ రెండు పార్టీలూ త్వ‌ర‌లోనే ఓ ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌ను సైతం సిద్ధం చేసుకుని ముందుకు సాగాల‌ని తీర్మానం చేసుకున్నాయి.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఈ ఉమ్మ‌డి పోరుతో వ‌చ్చే ఫ‌లితం.. ఎవ‌రి ఖాతాలోకి చేరుతుంద‌నేది పార్టీల్లో నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌! ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇది నిజ‌మే. ఎందుకంటే.. బీజేపీ నేత‌లు.. త‌మ‌కు తాము బ‌లంగా ఉన్నామ‌ని చెబుతున్నారు. టీడీపీని ఓడించింది కూడా తామేన‌నిఅంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో జ‌న‌సేన‌తో క‌లిసి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తే.. వ‌చ్చే మార్కులు.. ఎవ‌రికి ద‌క్కుతాయ‌నేది.. బీజేపీ నేత‌ల ఆలోచ‌న‌. ఇదేస‌మ‌యంలో త‌మ‌కంటే.. ఫైర్ బ్రాండ్‌లు లేర‌ని.. అనేక అంశాల‌పై ఇప్ప‌టికే జ‌గ‌న్ స‌ర్కారుకు అల్టిమేటం ఇచ్చామ‌ని.. ఈ కార‌ణంగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశార‌ని.. జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రాజ‌కీయంగా జ‌గ‌న్‌పై దూకుడు పెంచ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. ఎవ‌రి ఖాతాలోకి ఇది ప‌డుతుంది? అనేది చ‌ర్చ‌గా మారింది. నిజానికి తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఇరు పార్టీలూ విఫ‌ల‌మ‌య్యాయి. ఇక‌, స్థానిక స‌మ‌రంలోనూ ఇరు పార్టీలూ సాధించింది ఏమీ లేదు. కానీ, అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఒక ర‌కంగా.. అవ‌కాశం లేన‌ప్పుడు.. మ‌రోర‌కంగా మాత్రం ఇరు పార్టీల నాయ‌కులు వాద‌న‌లు వినిపిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. జ‌గ‌న్‌పై పోరాటం చేయాల‌నేది.. జ‌న‌సేన వ్యూహం. కానీ, టీడీపీపై ఉద్య‌మించాల‌నేది బీజేపీ ల‌క్ష్యం. కానీ, ఇప్పుడు ఏం జ‌రిగిందో తెలియ‌దుకానీ.. ఇరు పార్టీల వ్యూహం మొత్తంగా జ‌గ‌న్ పాల‌న‌వైపు మ‌ళ్లింది. ఇది మున్ముందు ఉద్య‌మ రూపంలో మారి.. ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అయితే.. జ‌న‌సేన విష‌యాన్ని తీసుకుంటే.. ఈ పార్టీ నేత‌లు ఒకింత దూకుడుగానే జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉంది. కానీ, బీజేపీకి మాత్రం ఈ త‌ర‌హా ప‌రిస్థితి లేదు. ముఖ్యంగా సోము వీర్రాజు స‌హా కొంద‌రు నేత‌లు.. జ‌గ‌న్‌కు సానుకూల‌మ‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి పోరు.. జ‌గ‌న్‌పై యుద్దం వంటివి ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే.. అంటున్నారు ప‌రిశీల‌కులు. తీరా ప్రారంభించిన త‌ర్వాత‌.. కొంద‌రు నేత‌లు ఒక ర‌కంగా.. మ‌రికొంద‌రు నేత‌లు ఇంకో ర‌కంగా.. ముందుకు సాగితే.. మొత్తానికి ప్ర‌యోజ‌నం లేక‌పోగా.. ఇరు పార్టీల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు చోటు చేసుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ జ‌గ‌న్‌పై పోరాటం విష‌యంలో ఈ రెండు పార్టీలు.. ఆచితూచి అడుగులు వేస్తే.. బెట‌ర‌ని అంటున్నారు. ముందు ప్ర‌జ‌ల వ‌ద్ద మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డం.. వారిని త‌మ‌వైపు తిప్పుకోవ‌డం వంటి విష‌యాల‌పై దృష్టి పెడితే.. మంచిద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News