అన్నమయ్య జలాశయం కొట్టుకుపోవడంలో మానవ తప్పిదం లేదంట!
ఆంధ్రప్రదేశ్ లో పోయిన సంవత్సరం నవంబరు 19న అన్నమయ్య జలాశయం మట్టి కట్ట కొట్టుకుపోవడంలో మానవ తప్పిందం ఏమీ లేదని తాజాగా నిపుణులు చెబుతున్నారు. అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోవడానికి సామర్థ్యానికి మించి వరద నీరు ఉధృతంగా రావడమే కారణమని నిర్ధారించారు. అన్నమయ్య జిల్లాలో చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య జలాశయం సామర్ధ్యం 2 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
అయితే గత సంవత్సరం నవంబరు 19న భారీ వర్షాలు, ఎగువ నుంచి భారీగా వచ్చిన వరద నీరుతో ప్రకృతి ప్రళయం సృష్టించింది. ఎగువన ఉన్న ఫించా జలాశయం నుంచి అన్నమయ్య జలాశయానికి ఏకంగా 5 లక్షల కూసెక్యుల వరదనీరు ఒక్కసారిగా వచ్చింది. దీంతో చెయ్యేరులో వరద నీరు ఉధృత రూపం దాల్చింది. సామర్ధ్యానికి మించి భారీ వరద రావడం, అది కూడా ఒక్కసారిగా వెల్లువెత్తడంతో అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగిపోయింది.
అధికారులు కూడా ఇంత భారీ వరదను ఊహించలేకపోయారు. దీంతో కడప జిల్లాలో పలు గ్రామాలు నీటి మునిగాయి. ఇళ్లు, పశువులు కొట్టుకుపోయాయి. పలువురు వ్యక్తులు మృత్యువాత కూడా పడ్డారు. ఆయా గ్రామాల్లో నాలుగు అడుగుల మేర ఇసుక మేటలు వేసుకుపోయిందంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ ఇసుక మేటలు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. ఎగువ, దిగువ మందపల్లె, పులపుత్తూరు, రామచంద్రాపురం, తొగురుపేటల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.
ఆ తర్వాత జలాశయాల నిర్మాణంలో నిష్ణాతులు, సాంకేతిక నిపుణులు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రతినిధులతో కూడిన మూడు బృందాలు అన్నమయ్య జలాశయాన్ని పరిశీలించాయి.
తొలుత వచ్చిన నిపుణుల కమిటీ, సాంకేతిక బృందాలు డ్యామ్ దెబ్బతినడానికి సామర్థ్యానికి మించి వరద నీరు ఉధృతంగా రావడమే కారణమని నిర్ధారణకు వచ్చాయి. కాగా కేంద్ర జలసంఘానికి చెందిన బృందం మూడు రోజుల క్రితం అన్నమయ్య జలాశయాన్ని పరిశీలించింది. ఫొటోలు, వీడియోలు తీసుకుంది. రెండు రోజులపాటు హైడ్రాలిక్ సిస్టమ్, ఎర్త్‌డ్యామ్ (మట్టి కట్ట), గేట్లు, స్టాప్‌లాక్స్, స్పిల్‌వేతోపాటు జలాశయం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక్కసారిగా భారీ వరద రావడం వల్లే మట్టి కట్ట తెగిపోయిందని ఈ బృందం నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో మానవ తప్పిదమేమీ లేదని తేల్చింది.
దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని అంటున్నాయి. ఇప్పటి వరకు మృతులకు, ఆయా గ్రామాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించడం, కొట్టుకుపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మంచడంలో తీవ్ర జాప్యం చేస్తోందని ఈ పిల్ దాఖలు చేశారు.