బాబు అరెస్ట్ పై తీవ్రంగా స్పందించిన పవన్

Update: 2020-01-09 05:30 GMT
అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా నిన్న రాత్రి అక్కడికి వెళ్లి హల్ చల్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. బుధవారం రాత్రి అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు, అఖిలపక్షం నేతలు పాదయాత్రగా బస్సు యాత్రను ప్రారంభించేందుకు వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకొని చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు, సీపీఐ రామకృష్ణను అరెస్ట్ చేశారు. అనంతరం ఉండవల్లిలోని  చంద్రబాబు నివాసం వద్ద వదిలివేశారు.

ఈ అరెస్ట్  పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శరామామూలుగానే తీవ్రంగా స్పందించారు. శాంతియుత ఉద్యమాన్ని అరెస్టులతో రెచ్చగొడుతారా అంటూ ఫైర్ అయ్యారు. హింసాత్మకంగా మారుస్తున్నారంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని గందరగోళాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటనే తెరదించాలని పవన్ డిమాండ్ చేశారు.

అరెస్ట్ నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేరని.. రైతులు, మహిళలను , వృద్ధులను అరెస్ట్ చేయడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని మరో నందిగ్రామ్ గా మార్చబోతున్నారా అని పవన్ ఫైర్ అయ్యారు. రాజధానిని తేల్చాలని.. ప్రజా వ్యతిరేకవిధానాలు మానుకోవాలని జగన్ కు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News