ఏపీలో మద్యం రవాణా.. వాళ్లు పట్టించుకోవడం లేదా?

Update: 2020-10-02 10:10 GMT
ఏపీలో మద్యానికి భారీగా రేట్లు పెంచడంతో పక్కరాష్ట్రాల నుంచి  అక్రమంగా భారీగా మద్యం సరఫరా అవుతోంది. ఎన్నిరకాలుగా కంట్రోల్ చేసినా అక్రమార్కులు ఏదో రూపంలో తీసుకొస్తూనే ఉన్నారు.

అయితే ఇటీవల కొందరు పోలీసులు ఈ అక్రమ రవాణాలో పట్టుబడడం కలకలం రేపింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మరింది. కొంతమంది పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొంత మంది తనిఖీలు చేపట్టకుండానే ఏపీలోకి వాహనాలను వదిలేస్తున్నారని.. ఈ క్రమంలోనే భారీగా తెలంగాణ మద్యం ఏపీలోకి సరఫరా అవుతోందని అంటున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతోందని పలువురు హెచ్చరిస్తున్నారు.

ఇక మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా సరిహద్దుల్లోనూ దాదాపు ఇదే విధంగా అక్రమ మద్యం జోరుగా సాగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మొదలైతే ఈ అక్రమ మద్యాన్ని కట్టడి చేయడం మరింత కష్టమని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఒక్కరొక్కరు మూడు బాటిల్స్ చొప్పున పెద్ద ఎత్తున రవాణాకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు.

మరి ఈ సరిహద్దుల్లో అక్రమరవాణాను అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తుందనే వేచిచూడాలి.
Tags:    

Similar News