రూల్స్ చేంజ్.. సహజీవనం చేస్తే ఆర్నెళ్ల జైలు శిక్ష..!

Update: 2022-12-07 04:49 GMT
ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి సహజీవనం చేస్తే తప్పేమీ లేదని అనేక దేశాలు ఇప్పటికే చట్టాలు చేశాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం సహజీవనం చేయడాన్ని తప్పుబడుతూ శిక్షలు ఖరారు చేస్తున్నాయి. తాజాగా ఇండోనేషియా ఈ జాబితాలో చేరింది. ఆ దేశంలో సహజీవనం.. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ నేర శిక్షాస్మృతిని సవరించింది.

ఈ ఏడాది నవంబర్లో బిల్లుకు తుది రూపం ఇచ్చిన ప్రభుత్వం నిన్న పార్లమెంట్ ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఎంపీలంతా ఏకగ్రీవంగా మద్దతు తెలుపడంతో ఈ చట్టం ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఇండోనేషియా ఎవరైనా సహజీవనం.. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే నేరంగా పరిగణించ బడుతుంది.

ఏ వ్యక్తి అయిన మరో వ్యక్తితో సహజీవనం చేసినా.. వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లయితే సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు లేదా వారి పిల్లలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయబడుతుంది. సహజీవనం చేసే వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష.. వివాహేతర సంబంధం పెట్టుకున్న వారికి ఏడాది పాటు జైలు శిక్ష చట్టప్రకారం విధించనున్నారు.

ఈ నిబంధనలు ఇండోనేషియాకు వచ్చే పర్యాటకులకు కూడా వస్తుందని తాజా చట్టంలో పేర్కొనడం గమనార్హం. వీటితోపాటు అనేక చట్టాల్లో ఇండోనేషియా తాజాలు మార్పులు చేసింది. అబార్షన్ చేయించుకోవడం.. దైవ దూషణలకు పాల్పడటం చేస్తే కూడా ఇండోనేషియాలో జైలుకు వెళ్లాల్సిందే. అంతేకాకుండా ఆ దేశ అధ్యక్షుడిని.. ఉపాధ్యక్షుడిని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను దూషించడాన్ని నిషేధించారు.

తనను ఎవరైనా దూషించారని దేశాధ్యక్షుడు ఫిర్యాదు చేస్తే నిందితులకు ఏకంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే ఇండోనేషియా కమ్యూనిజాన్ని వ్యాపింప జేయలని చూస్తే నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు విధించేలా చట్టాలు తీసుకొచ్చారు. కాగా ఈ నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉన్నాయంటూ మానవ హక్కుల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News