బ్రేకింగ్ : క్వారంటైన్ లో ఉంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త !

Update: 2020-04-04 09:50 GMT
కరోనా మహమ్మారి కారణంగా  స్వీయ నిర్బంధంలో ఉన్న ఓ కరోనా అనుమానితుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటన పై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌ కు చెందిన ఓ పారిశ్రామికవేత్త వినోదాబాయ్‌ లో  కరోనా వైరస్  లక్షణాలతో కనిపిండంతో, వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులకి ఆ విషయాన్ని తెలిపి , కరోనా నిర్దారణ పరీక్షలు చేపించుకున్నారు. ఆ తరువాత కరోనా నిర్దారణ పరీక్షల్లో ..   ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలింది.

అయినప్పటికీ,  అతన్ని 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని వైద్యులు  సూచించారు. ఈ క్రమంలోనే వినోదాబాయ్‌ తన నివాసాన్ని  క్వారెంటైన్‌ సెంటర్‌ గా మార్చుకున్నారు. అందులోనే గత 13 రోజులుగా ఉంటున్నారు. కానీ , తాజాగా శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఇంటి సీలింగ్‌ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే , ఆయన మృతికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది. అతడు ఆత్మహత్య చేసుకున్న  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తును ప్రారంభించారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో వ్యాపారంలో బాగా  నష్టాలు వచ్చాయన్న కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News