బ్లాక్ అండ్ వైట్ లో మృణాల్ అందాలు.. పట్టుచీరలో

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2026-02-28 11:30 GMT

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన క్లాసిక్ లుక్స్‌తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సీతారామం మూవీతో అందరికి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. పట్టుచీరలో ముఖానికి నల్లటి బొట్టు, మెడలో సంప్రదాయ ఆభరణాలతో మృణాల్ ఒక దేవతలా మెరిసిపోతోంది. ఈ ఫోటోషూట్ చూస్తుంటే పాతకాలపు హీరోయిన్లను గుర్తు చేస్తోందంటూ అభిమానులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

 

క్లాసిక్ లుక్‌లో మృణాల్ మ్యాజిక్.. వైరల్ అవుతున్న ఫోటోలు:

 

మృణాల్ ఠాకూర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను పంచుకుంటుంది. అయితే, ఈసారి ఆమె ఎంచుకున్న బ్లాక్ అండ్ వైట్ థీమ్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంది. పట్టుచీర కట్టుకుని, కళ్ళలో ఒక రకమైన ఇంటెన్సిటీతో ఆమె ఇచ్చిన ఫోజులు ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. రంగుల ప్రపంచంలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలకు ఉండే విలువే వేరు, అది మృణాల్ లాంటి అందగత్తెకు తోడైతే ఇక చెప్పక్కర్లేదు. ఈ ఫోటోలు చూసిన వారంతా "అచ్చం పాతకాలపు బొమ్మలా ఉంది" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అడివి శేష్-మృణాల్ జంటగా :

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం 'డెకాయిట్'. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అడివి శేష్ మార్క్ యాక్షన్ మరియు మృణాల్ మార్క్ ఎమోషన్ కలిపి ఈ సినిమాను చాలా ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో మేజర్ హైలైట్ కాబోతోందని విడుదల ఐన పాట చుస్తే అర్థమవుతోంది.

ఏప్రిల్ 10న థియేటర్లలోకి ‘డెకాయిట్’ గర్జన:

ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇంకొంత కాలం వేటింగ్ తప్పదు. ఇక 'డెకాయిట్' సినిమాను ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇది ఒక గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. అడివి శేష్ అంటేనే ఒక మినిమం గ్యారెంటీ కథ ఉంటుందని అందరికీ నమ్మకం, దానికి తోడు మృణాల్ ఠాకూర్ లాంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ నటి తోడవడంతో అంచనాలు భారీగా పెరిగాయి. వేసవి కానుకగా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి..

Tags:    

Similar News