• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Photo Story >  డ్రీమ్ ఓకే, రిలీజ్...

డ్రీమ్ ఓకే, రిలీజ్ ఎప్పుడు?

| సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

By - saisumeeth
Update: 2023-07-17 12:21 GMT

సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో అఖిల్ కి జోడీగా నటించింది. అలాగే తమిళంలో జయం రవికి జోడీగా భూమి మూవీలో జటించింది. అలాగే శింబుకి జోడీగా ఈశ్వరన్ చిత్రంలో మెరిసింది.

చివరిగా గల్లా అశోక్ కి జోడీగా హీరో చిత్రంతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే స్టార్ హీరోయిన్ ఫేమ్ కోసం ఈ బ్యూటీ చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తోంది. అనుకోని అవకాశంగా హరి హర వీర మల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది.


క్రిష్ జగర్లమూడి దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. రెండేళ్ళ నుంచి ఈ మూవీ షూటింగ్ జరుపుకొంటోంది. సినిమాపై నిధి అగర్వాల్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా నిధి పాప తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో నా డ్రీమ్ నిజమైంది. హరి హర వీర మల్లు సినిమాలో పవన్ కళ్యాణ్, క్రిష్ జగర్లమూడి, ఎం.ఎం. కీరవాణి లాంటి అద్భుతమైన స్టార్స్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

మీకు త్వరలోనే ఈ సినిమా నుంచి ఈ మ్యాజిక్ చూస్తారని పేర్కొంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి రెండేళ్ళు అవుతోంది. ఇప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఓ వైపు పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు పెండింగ్ షూట్ కంప్లీట్ చేయకుండా భీమ్లా నాయక్ కంప్లీట్ చేశారు. బ్రో మూవీ రిలీజ్ కి రెడీ అయిపోతోంది. ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

క్రిష్ కూడా హరిహర వీరమల్లు సినిమాని నమ్ముకొని ఉన్నారు. అయితే మూవీ ఎటు కదలకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పైకి వెళ్ళలేకపోతున్నారు. రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని క్రిష్ అనుకున్న అది జరిగేలా లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనల కారణంగా ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మరి రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తానికి నిధి అగర్వాల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కూడా ఆమెకి అదృష్టాన్ని మాత్రం ఈ చిత్రం తీసుకురాలేదని చెప్పాలి.

Tags:    
  • NidhiAgarwal 
  • Pawankalyan 
  • HariHaraVeeramalu 
  • Tollywood 
  • MovieNews 

Similar News

దేవకన్యలా కుర్రకారును మైమరపిస్తున్న టాలీవుడ్ బ్యూటీ!

2026-11-28 06:29 GMT

వైట్ అవుట్‌ఫిట్‌లో హాట్ ట్రీట్ ఇస్తున్న ఆయిషా శర్మ!

2026-11-23 05:46 GMT

కళ్ళుచెదిరే అందాలతో కియారా.. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న కూతురు!

2026-11-19 05:32 GMT

జారిపోతున్న షోల్డర్ తో పరువాల విందు వడ్డిస్తున్న నభా నటేష్!

2026-11-17 00:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..

2026-11-07 05:16 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS