“బ్యాన్ అయ్యావ్ బాస్!” నుంచి “వెల్కమ్ బ్యాక్” వరకూ.. అమెరికా ఎంట్రీతో ఇండియన్ స్టూడెంట్స్‌కు కొత్త ఆశ!
అమెరికా వెళ్లే ప్రతి భారతీయ విద్యార్థి జీవితంలో ‘జాతక చక్రం’ కంటే ఇమ్మిగ్రేషన్ చక్రాన్నే ఎక్కువ నమ్ముతుంటారు.
అమెరికా వెళ్లే ప్రతి భారతీయ విద్యార్థి జీవితంలో ‘జాతక చక్రం’ కంటే ఇమ్మిగ్రేషన్ చక్రాన్నే ఎక్కువ నమ్ముతుంటారు. ఎందుకంటే అక్కడ మూడు భయాలు ఎప్పుడూ కామన్‌గా ఉంటాయి. వీసా ఇంటర్వ్యూ, యూనివర్సిటీ ఫీజు , ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ ముఖం.. ఇటీవల ఓ భారతీయ ఎఫ్-1 విద్యార్థి అమెరికాలోకి మళ్లీ అడుగుపెట్టిన వింత విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ వచ్చాయి.. నీకు అమెరికాలోకి నో ఎంట్రీ.. నువ్వు బ్యాన్ అయ్యావ్ బాస్!” అంటూ ఎయిర్‌లైన్ సిబ్బంది మొదట గుండె ఆగే షాక్ ఇవ్వడం.. చివరికి అదే విద్యార్థిని నవ్వుతూ అమెరికాలోకి పంపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలు కథేంటంటే..?
ఈ కథలోని హీరోగారు ఏడునెలల పాటు అమెరికా బయటే భారత్‌లో ఉంటూ.. స్టెమ్ ఓపీటీపై హ్యాపీగా రిమోట్‌గా పని చేస్తూ ఉన్నాడు. సాధారణంగా ఆరు నెలలకు మించి అమెరికా బయట ఉంటే ఇమ్మిగ్రేషన్ వద్ద ‘థర్డ్ డిగ్రీ’ తరహా ప్రశ్నలు ఎదురవుతాయని టాక్. దానికి తోడు తాజాగా పీహెచ్‌డీ అడ్మిషన్ కూడా రావడంతో.. చేతిలో ‘ట్రాన్స్‌ఫర్-పెండింగ్ ఐ-20’ పట్టుకుని, ధైర్యం చేసి అమెరికాకు బయలుదేరాడు.
కాని అసలు సినిమా ఎయిర్‌పోర్ట్ కౌంటర్ దగ్గరే మొదలైంది!
“సార్… న్యూ రూల్స్ ప్రకారం యూ ఆర్ బ్యాన్!” అని ఎయిర్‌లైన్ స్టాఫ్ బాంబ్ పేల్చడంతో ఆ విద్యార్థి గుండె ఒక్కసారిగా జారి కిందపడ్డట్టయ్యిందట. ఆ మాట వినడమే ఆలస్యం.. పక్కనే క్యూలో ఉన్న మిగతా భారతీయ విద్యార్థులు కూడా ఒక్కసారిగా హడలిపోయి, తమ ఫోన్లలో వీసా స్టేటస్‌లు చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశారట! అక్కడ సీన్ అలా క్రియేట్ అయ్యింది మరి.
స్టూడెంట్ క్లాస్.. స్టాఫ్ సైలెన్స్!
అయితే మనోడు కంగారు పడకుండా గూగుల్ నాలెడ్జ్ కాకుండా ఒరిజినల్ రూల్స్ వాడాడు. “నా ఎఫ్-1 వీసా కొత్త ప్రొక్లమేషన్‌కు ముందే జారీ అయింది. ఒకసారి మీ పాలసీ బుక్ మళ్లీ చెక్ చేయండి ప్లీజ్” అని ప్రశాంతంగా వివరించాడు. దాంతో ఆ ఎయిర్‌లైన్ స్టాఫ్ లోపలికి వెళ్లి.. ఫోన్‌లు చేసి, సిస్టమ్‌లు వెతికి, సూపర్‌వైజర్లను పిలిచి.. మొత్తానికి ఒక 20 నిమిషాల హైడ్రామా నడిపిన తర్వాత బోర్డింగ్ పాస్ చేతిలో పెట్టారు.
ఇమ్మిగ్రేషన్ అంటే ‘ఇంటర్వ్యూ’ కాదు.. ‘ఇంటెన్స్ థ్రిల్లర్’!
ఇక అమెరికా బోర్డర్ దాటేటప్పుడు ఎలాంటి ఇంటర్వ్యూ ఉంటుందో అని ఫిక్స్ అయిపోయిన విద్యార్థికి.. అమెరికా ప్రీక్లియరెన్స్ మాత్రం ఊహించని రీతిలో సాఫీగా సాగిపోయింది. కెనడాలోని కాల్గరీ ద్వారా ప్రయాణించిన ఈ విద్యార్థిని అమెరికా అధికారులు కేవలం స్టెమ్ ఓపీటీ , పీహెచ్.డీ అడ్మిషన్, ట్రాన్స్‌ఫర్ ఐ-20 గురించి సింపుల్ ప్రశ్నలే అడిగి.. “వెల్కమ్ బ్యాక్” అనేశారు. అంతే… అంత బిల్డప్ ఇచ్చిన ఎంట్రీ కేవలం ఐదు నిమిషాల్లో ముగిసిపోయింది!
నెట్‌ఫ్లిక్స్ సీజన్ల కంటే వేగంగా మారే రూల్స్!
ఈ ఘటన ప్రస్తుతం అమెరికాకు తిరిగి వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల్లో పెద్ద ఊరటనిస్తోంది. ముఖ్యంగా “ఎయిర్‌పోర్ట్‌లోనే వెనక్కి పంపేస్తారట”, “కొత్త రూల్స్‌తో ఎంట్రీ క్లోజ్” వంటి వాట్సాప్ యూనివర్సిటీ రూమర్ల మధ్య ఈ రియల్ ఎక్స్‌పీరియన్స్ చాలామందికి ధైర్యాన్ని ఇస్తోంది.
కాని నిపుణులు ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే
“సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టును బ్లైండ్‌గా నమ్మేయకండి బాస్! అధికారిక యూఎస్.సీఐఎస్ , యూనివర్సిటీ, డీఎస్.ఓ మార్గదర్శకాలను మాత్రమే ఫాలో అవ్వండి. ఎందుకంటే అమెరికా ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సీజన్ల కంటే వేగంగా మారుతున్నాయి!” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఏదేమైనా.. ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే అమెరికా ఇమ్మిగ్రేషన్ కూడా అరిటాకులో బోజనం పెట్టినంత ఈజీ అని ఈ స్టూడెంట్ నిరూపించాడు!