• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పోస్ట్ మార్టం...వైసీపీ...

పోస్ట్ మార్టం...వైసీపీ వీక్ అవుతోందా ?

| ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి ఆధిపత్యం కొనసాగుతుండగా, వైసీపీ చాలా చోట్ల గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. నంద్యాలలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో పార్టీ కొన్ని చోట్ల విజయాలు సాధించింది. అయితే నాయకుల నిర్లక్ష్యం, క్యాడర్‌కు ఆర్థిక భరోసా లేకపోవడం, క్షేత్రస్థాయిలో బలహీనమైన పోరాటం వైసీపీ ఫలితాలపై ప్రభావం చూపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

By - Satya P
Update: 2026-11-07 03:51 GMT

ఏపీలో టీడీపీ కూటమి మున్సిపల్ ఎన్నికలను స్వీప్ చేసి పారేసింది. పరిషత్తు ఎన్నికల్లో అదే ట్రెండ్ గా ఉంది. దాంతో 40 శాతం ఓటు షేర్ బలమైన ప్రతిపక్షం, 2029 ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని ఇంతకాలం చెబుతున్న మాటలు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు లోకల్ బాడీస్ రిజల్ట్ సాక్షిగా పక్కాగా వీగిపోతున్నాయని అంటున్నారు. ఎందుకంటే మాటలు వేరు, ఆచరణ వేరు, రిజల్ట్ వేరు, ఈ మూడింటికీ కో ఆర్డినేషన్ ఉంటేనే వాస్తవం అవుతుంది. మాటలు ఎందుకు చెబుతారు అంటే క్యాడర్ లో నైతిక స్థైర్యం నింపడానికి. ఇక ఆచరణలోకి అవి రావాలంటే బలంగా గ్రౌండ్ లో ఉండాలి. అలా నిలబడి కలబడితేనే ఫలితాలు బాగా వస్తాయి. ఇపుడు వైసీపీ తీరు చూస్తే స్థానిక పోరులో ఎక్కడా ఉనికిని చాటుకోలేక చతికిలపడిపోయింది అని అంటున్నారు.

నిలిచి గెలిచిన చోట :

వైసీపీ ఓటమికి కారణాలు అధికార కూటమి రిగ్గింగ్ అని హైజాక్ అని కబ్జా అని ఏవైనా విమర్శలు చేయవచ్చు. కానీ అవి అన్ని చోట్లా సాగలేదు. పైగా అలా జరిగిన చోట్ల కూడా వైసీపీకి ఎన్నో కొన్ని సీట్లు వచ్చాయి. ఇక రాయలసీమలో నంద్యాల మునిసిపాలిటీలో వైసీపీ విజయం సాధించింది. దానికి కారణం గట్టిగా నిలబడిన యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అంటున్నారు. అలాగే బేతంచర్లని నిలబెట్టుకున్నా డోన్ లో గట్టిగా పోరాడినా కూడా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఖాతాలో ఆ క్రెడిట్ వెళ్తుంది. అలాగే అనంతపురం కార్పోరేషన్ వైసీపీ ఖాతాలోకి వచ్చింది అంటే అక్కడ మాజీ ఎంపీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి చేసిన కృషి అని అంటున్నారు. కానీ అదే పోరాట స్పూర్తి అంతటా కొనసాగించలేకనే వైసీపీ చతికిలపడింది అని అంటున్నారు.

ఉదాశీనంగానే :

వైసీపీలో ఇపుడు పరిస్థితి ఎలా ఉంది అంటే లీడర్లు అంతా ఉదాశీనంగా ఉన్నారు అని అంటున్నారు. ఎందుకొచ్చిన ఎన్నికలు అని ఆరు నెలల నుంచి పెద్ద నాయకులు అంటూనే ఉన్నారని ప్రచారంలో ఉంది. తీరా అధినాయకత్వం ఎన్నికలకు వెళ్లాల్సిందే అని హుకుం జారీ చేయడంతో తప్పని పరిస్థితులలోనే చాలా చోట్ల పోటీకి సిద్ధపడ్డారు అని అంటున్నారు. ఇక్కడే అధినాయకత్వం అన్న ఒక మాట పార్టీ నేతలకు మరోలా వినిపించింది అని అంటున్నారు. ఏకగ్రీవాలు వద్దు అభ్యర్ధులను నిలబెట్టండి అని హైకమాండ్ చెప్పింది. దాంతో నామినేషన్లు ఇచ్చేసి అభ్యర్ధులను నిలబెట్టేశారు. వారు ఆర్ధికంగా బలవంతులా సమర్ధులా కూటమి పోటీకి తట్టుకుంటారా అన్న ఆలోచన ఎక్కడా చేయలేదని అంటున్నారు. ఇక వారికి ఆర్థికంగా భరోసా ఇవ్వకపోగా పట్టించుకోలేదని అందుకే కోస్తాలో వైసీపీ గెలుపునకు చాలా దూరంలో ఉండిపోయింది అని అంటున్నారు.

కాడె వదిలేసి :

ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో కొంత నాయకులు కనిపించారని తీరా ఆ ఫలితాలు రావడం కూటమి ప్రభంజనం చూసిన తరువాత జరిగిన పరిషత్తు ఎన్నికల్లో అయితే ఎక్కడా అయిపూ అజా లేకుండా పోయారని అంటున్నారు. ఎలాగూ కూటమి గెలుస్తుంది ఎందుకొచ్చిన తంటా అనుకున్నారేమో తెలియదు కానీ అనేక చోట్ల కాడె వదిలేశారు అని అంటున్నారు. ఫలితంగానే కూటమికి రెండు విధాలుగా మేలు జరిగిందని నిలిచి నిలదీసే విపక్షం లేకపోవడం వల్ల ఏకపక్షంగానే చాలా చోట్ల పరిషత్తు పోలింగ్ సాఫీగా సాగింది అని అంటున్నారు.

డీమోరలైజ్ అయ్యారా :

ఇక వైసీపీ క్యాడర్ అయితే డీమోరలైజ్ అయ్యారని అంటున్నారు. నాయకులకు క్యాడర్ కి మధ్య అదే అంతరం కొనసాగుతోంది అని అంటున్నారు. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్న చందాన నామినేషన్లకు బీ ఫారాలు ఇచ్చేసి ఊరుకున్నారని కూటమిని తట్టుకోలేకనే ఓటమి పాలు అయ్యామని అంటున్నారు. దీంతో ఇలాగైతే గెలిచేది ఎలా అని క్యాడర్ డీమోరలైజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఏమి చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీ సంస్థాగతంగా వీక్ గా ఉంది అని స్థానిక పోరు నిరూపించింది అంటున్నారు.

Tags:    
  • ysrcp 
  • tdpalliance 
  • aplocalelections 
  • tdp 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS