చిన్నారిని ఆడిస్తూ పేరు పెట్టిన జగన్ మామయ్య
అధికారంలో ఉన్నా లేకున్నా.. ప్రజల్లో కొందరు అధినేతలకు ఉండే అభిమానం వేరే లెవల్ లో ఉంటుంది.;
అధికారంలో ఉన్నా లేకున్నా.. ప్రజల్లో కొందరు అధినేతలకు ఉండే అభిమానం వేరే లెవల్ లో ఉంటుంది. అందుకు నిదర్శనంగా నిలిచే నేతల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తారు. ఎన్నికల ఫలితాల్ని పక్కన పెడితే.. ఈ రోజుకు ఆయన ఏదైనా ప్రాంతానికి వెళుతున్నారంటే.. అక్కడకు వచ్చే జనసందోహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అంతటి ప్రజాదరణను సొంతం చేసుకున్న జగన్ కు.. చిన్నారులు.. మహిళలు.. పెద్ద వయస్కులు అంటే ప్రత్యేక అభిమానం.
తాను ఏ స్థానంలో ఉన్నా.. ఏ స్థాయిలో ఉన్నా వారిని అభిమానంతో అక్కున చేర్చుకోవటం కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన్ను కలిసేందుకు తమ చిన్నారిని తీసుకొని జగన్ ను కలిశారు ఒక అభిమాన జంట. తమ చిన్నారికి పేరు పెట్టాలని వారు కోరారు. ఆ చిన్నారికి మామయ్యగా మారిన జగన్మోహన్ రెడ్డి..ఆ చిన్నారిని లాలిస్తూ.. నామకరణం చేశారు.
మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి.. చందనాదేవి దంపతులు తాజాగా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమ చిన్నారికి పేరు పెట్టాలని.. ఆయన చేత పేరు పెట్టించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన్ను కలిశారు. దంపతుల కోరిక మేరకు వారిని అడిగి తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి.. చిన్నారికి ‘‘మోక్షితా రెడ్డి’’గా పేరు పెట్టారు. తాము ఎంతగానో అభిమానించి.. ఆరాధించే జగన్ చేతుల మీదుగా తమ చిన్నారి నామకరణ జరగటాన్ని వారు ఎంతో ఆనందానికి గురవుతున్నారు. ఈ తరహా అభిమానాన్ని సొంతం చేసుకున్న అధినేతలు అతి తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరిగా నిలుస్తారు జగన్మోహన్ రెడ్డి.