• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చిన్నారి చెప్పు తీసి...

చిన్నారి చెప్పు తీసి ఇచ్చిన జగన్... వీడియో వైరల్!

| ఈ నేపథ్యంలో తాజాగా గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

By - Raja Ch
Update: 2025-12-02 10:20 GMT

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బయటకు వస్తే ప్రజాధరణ విపరీతంగా ఉంటుందనే చర్చ అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బలంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన అభివాదం చేస్తే తీరు, పలువురితో ఆయన నడుచుకునే విధానానికి ఫ్యాన్స్ ఉన్నారని అంటారు. ఈ క్రమంలో తాజాగా గన్నవరం ఎయిర్ పోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

అవును... వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపరీతమైన సెక్యూరిటీ మధ్య జనాల్లోకి వచ్చేవారు! ఈ సమయంలో పరదాల మాటున ప్రజల్లోకి వచ్చే వారనే విమర్శలు నాటి ప్రతిపక్షాల నుంచి వినిపించేవి. ఆ సంగతి అలా ఉంటే.. ఇటీవల మాజీ ముఖ్యమంత్రిగా మారిన జగన్.. ఎవరినైనా పరామర్శించడానికి వెళ్లినా, వివాహాలకు హాజరైనా, విమానాశ్రయంలో కనిపించినా.. ఆఖరికి కోర్టుకు హాజరైనా జనాలు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలో తాజాగా గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. మామూలుగానే జగన్ కు సంబంధించిన విషయం (పాజిటివ్ / నెగిటివ్) ఏదైనా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుందని అంటారు. ఈ క్రమంలో.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఓ చిన్నారి పట్ల ఆయన చూపించిన ప్రేమాభిమానాల విషయం ఇప్పుడు సోషల్ మీడియాకు చేరి, హల్ చల్ చేస్తోంది.

ఇందులో భాగంగా... గన్నవరం విమానాశ్రయానికి జగన్ ను చూసేందుకు ఓ వ్యక్తి తన కుమార్తెతో పాటు వచ్చారు. ఈ సమయంలో జగన్ అటుగా వస్తున్న సమయంలో ఆ చిన్నారి చెప్పు కాలి నుంచి జారి కిందపడిపోయింది. అది గమనించిన జగన్.. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె చెప్పును తీసి అందించారు. అనంతరం.. ఆమెను ఆప్యాయంగా స్పృశించారు! దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



చిన్నారి చెప్పు తీసి ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్‌

ఎయిర్ పోర్టులో తనను చూడటానికి వచ్చిన చిన్నారి చెప్పును తీసి ఇచ్చిన జగన్

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో#YSJagan #YSRCP #AndhraPradesh #TeluguNews #Tupaki pic.twitter.com/t7ck8xh1KW

— Tupaki (@tupaki_official) December 2, 2025


Tags:    
  • ysjaganmohanreddy 
  • gannavaramairport 
  • ysjaganfans 
  • airportclip 
  • ysrcp 
  • appolitics 
  • airportmoments 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS