యూపీ సీఎం యోగి... సూపర్ ఫిట్ నెస్ సీక్రెట్ !

దేశంలో ఉత్తర ప్రదేశ్ కి ఒక ప్రత్యేకత ఉంది. అతి పెద్ద రాష్ట్రం అది. అక్కడ సీఎం గా చేస్తే సగం దేశాన్ని ఏలినట్లే అంటారు.

Update: 2026-06-07 02:30 GMT

దేశంలో ఉత్తర ప్రదేశ్ కి ఒక ప్రత్యేకత ఉంది. అతి పెద్ద రాష్ట్రం అది. అక్కడ సీఎం గా చేస్తే సగం దేశాన్ని ఏలినట్లే అంటారు. అంతే కాదు ఆ తరువాత స్టెప్ నేరుగా ప్రధాని పీఠమే అని కూడా అంటారు. యూపీ నుంచే ఎక్కువ మంది ప్రధాని పీఠానికి చేరుకున్నారు. అది చరిత్రలో పదిలంగా ఉంది. అలాంటి స్టేట్ కి వరసగా రెండు సార్లు బ్రహ్మాండమైన మెజారిటీతో సీఎం గా చేయడం అంటే గ్రేట్. అలా గత తొమ్మిదేళ్ళుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్న యోగీ ఆదిత్య నాధ్ తాజా పుట్టిన రోజును జరుపుకున్నారు. ఆయన జీవితంలో 54 ఏళ్ళు పూర్తి చేసుకుని 55వ ఏట అడుగు పెట్టారు.

ఆరోగ్య రహస్యం అంటే :

అయితే ఆయన ఈ రోజుకీ పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తూంటారు. పెద్ద రాష్ట్రం కాబట్టి ఆయన బిజీగా ఉంటారు. మరి అయిదున్నర పదుల వయసులో ఉన్న ఆయన ఎలా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆయన సూపర్ ఫిట్ నెస్ వెనక సీక్రెట్ ఏంటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటరే ఉంద్ మరి. యోగి తేలికగా జీర్ణం అయ్యే ఆహారమే తీసుకుంటారు. నూనెలు మసాలాలు ప్రాసెస్ చేసిన పదార్ధాలు ఏవీ ఆయన ఆహారంలో ఉండవు. ఆయన బ్రేక్ ఫాస్ట్ ఒక చల్లని మజ్జిగతో తో మొదలవుతుంది. అలాగే విటమిన్లు ఏ, సీ ఫైబర్ ఉండే బొప్పాయి పండుని ఆయన తీసుకుంటారు. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను సూపర్ గా చేస్తుంది. ప్రొటీన్ ఫైబర్ ఐరన్ సమృద్ధిగా ఉండే ఉడికించిన శనగలు అదే విధంగా పెసలు వంటివి కూడా యోగి తన అల్పాహారంలో చేర్చుకుంటారు. అలాగే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉండే గోధుమ రవ్వతో చేసిన అల్పాహరం తీసుకుంటారు.

లైట్ గానే లంచ్ :

ఇక యోగి లంచ్ లైట్ గానే ముగుస్తుంది. ఆయన మధ్యాహ్న భోజనంలో కొన్ని చపాతీలు అందులో ఉడికించిన కూరగాయలు తీసుకుంటారు. క్యారెట్, బీన్స్ బంగాళా దుంపలు వంటి పోషకాల్తో కూడిన వాటిని చేర్చుకుంటారు. ఇలా అతి తక్కువ క్వ్వు ఉన్న కూరగాయలనే ఆయన తన లంచ్ లో ఎంపిక చేసుకుంటారు. రాత్రి డిన్నర్ కూడా ఇదే తీరున ఉంటుంది. ప్రోటీన్స్ కోసం పప్పు, ఐరన్ కోసం ఆకు కూరలు ఆయన రాత్రి భోజనంలో చేర్చబడతాయి. ఇక ఒక్కోసారి ఆయన రాత్రి భోజనం మానేసి తన ఆహార నియమాలను గట్టిగా పాటిస్తారు. ఆ సమయంలో జస్ట్ ఒక యాపిల్ ని తినేసి భోజనం అయిందనిపిస్తారు. యాపిల్ లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణ క్రియకు ఎంతగానో సాయపడడమే కాకుండా భోజనం చేసినట్లుగానే ఉంటుంది.

మోడీ లాగానే యోగి :

ఇక రాజకీయ జీవితం చూస్తే మోడీ మాదిరిగానే ఓటమి ఎరుగని వీరుడు యోగి ఆదిత్యనాధ్. ఆయన 26 ఏళ్ల వయసులో ఉన్నపుడే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా తొలిసారి గోరఖ్‌పూర్ నుండి 1998లో గెలిచారు. ఆ మీదట 1999, 2004, 2009, 2014ల్లో వరుసగా గెలిచి మొత్తం ఐదు సార్లు లో‍క్‍సభ సభ్యుడుగా విజయం సాధించారు. ఇక 44 ఏళ్ళకే ఉత్తర ప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రానికి సీఎం గా అవకాశం దక్కించుకున్న యోగి 2027లో మళ్ళీ బీజేపీని గెలిపించి ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణం చేయాలని చూస్తున్నారు. బీజేపీలో అగ్ర నేతగా కాబోయే ప్రధానిగా ఆయన పేరు బహుళ ప్రాచుర్యంలో ఉంది. మోడీ తరువాత యోగి అన్నది అందరి మాటగా ఉంది. బ్రహ్మచారిగా జీవనం సాగిస్తున్న యోగి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠానికి ప్రధాన పూజారిగా కూడా వ్యవహరిస్తున్నారు అతివాద హిందూత్వగా యోగికి పేరు. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కి సైతం ఆయన ఆశాకిరణంగా కనిపిస్తారు. ఈ దేశానికి ప్రధానిగా యోగీని చూడొచ్చా అన్నది కాలం చెబుతుంది. రాజకీయంగా చూస్తే 54 ఏళ్ళు చిన్న వయసే. దాంతో మోడీ ఎక్కాల్సిన రాజకీయ శిఖరాలు ఎన్నో ఉన్నాయని ఆయన పుట్టిన రోజు పూటా అభిమానులు అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News