ఒక ర్యాంప్ సూపర్ వైజర్ ఇండిగో సీఈవో ఎలా అయ్యాడు? ఎలా ముంచాడు?

పీటర్ ఎల్బర్స్‌ కు ఏవియేషన్ రంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. బిజినెస్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2006లో కొలంబియా బిజినెస్ స్కూలులో ఎగ్జిక్యూటివ్ ఎడ్యూకేషన్ పూర్తి చేశారు.;

Update: 2025-12-07 08:56 GMT

ప్రస్తుతం దేశంలో ‘ఇండిగో’ వివాదం పతాకస్థాయికి చేరింది. దేశంలో ప్రస్తుతం ఇండిగో విమాన సర్వీసుల రద్దు.. తీవ్ర జాప్యం వంటి కారణాల వల్ల ఏర్పడిన విమానయాన సంక్షోభం చర్చనీయాంవమైంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ సంస్థ సీఈవో ‘పీటర్ ఎల్బర్స్’ కు షోకాజ్ నోటీసు జారీ చేయడం.. ఆయనకు 24 గంటల్లో స్పందించాలని గడువు ఇవ్వడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం, ఇబ్బంది కలిగించిన ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగో సీఈవోకు వేటు తప్పదేమోననే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. దీంతో పీటర్స్ ఎల్బర్స్ నేపథ్యం.. ఆయన ప్రయాణంపై చర్చ జరుగుతోంది.

పీటర్ ఎల్బర్స్‌ ఏవియేషన్ లో సుధీర్ఘ అనుభవం..

పీటర్ ఎల్బర్స్‌ కు ఏవియేషన్ రంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. బిజినెస్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2006లో కొలంబియా బిజినెస్ స్కూలులో ఎగ్జిక్యూటివ్ ఎడ్యూకేషన్ పూర్తి చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ లో కూడా సభ్యుడిగా ఉన్నారు. 2024 జూన్ లో అదేబోర్డుకు చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఒక సాధారణ ర్యాంప్ సూపర్ వైజర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2022లో ఇండిగో సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇండిగోకు రాకముందు ఎల్బర్స్ దాదాపు 30 ఏళ్ల పాటు కేఎల్ఎం రాయల్ టచ్ ఎయిర్ లైన్స్ లో పనిచేశారు. 2014-2022 వరకూ కేఎల్ఎంలో ప్రెసిడెంట్, సీఈవో హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. 2011-14 మధ్య చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. అంతకుముందు నెట్ వర్క్ అండ్ అలయన్సెస్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. కేఎల్ఎం గ్రూప్ తరుఫున జపాన్, గ్రీస్, ఇటలీలో జనరల్ మేనేజర్ గా కూడా పీటర్ బాధ్యతలు నిర్వర్తించారు. 1995-1999 మధ్య నెట్ వర్క్ ప్లానింగ్ లో పనిచేశారు. ఆయన కెరీర్ ను 1992-1995 వరకూ 1995 వరకూ ఆమ్ స్టార్ డ్యామ్ ఎయిర్ పోర్టులో ర్యాంప్ సూపర్ వైజర్ గా ప్రారంభించారు.

ఒక ర్యాంప్ సూపర్ వైజర్ స్థాయి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ లైన్స్ లో ఒకటైన ఇండిగోకు సీఈవోగా ఎదగడం పీటర్ ఎల్బర్స్ అనుభవాన్ని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అయితే ప్రస్తుతం సంక్షోభం నుంచి ఇండిగోను, తన పదవిని ఆయన ఎలా కాపాడుకోగలరు అనేది ఇప్పుడుదేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News