మేయర్ సీటు....రాజు గారి డాటర్ టార్గెట్ ?

విశాఖ మేయర్ సీటు మీద చాలా మందికి కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనది కాబట్టి.

Update: 2026-10-03 04:02 GMT

విశాఖ మేయర్ సీటు మీద చాలా మందికి కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనది కాబట్టి. అయిదు వేల కోట్ల వారిషిక బడ్జెట్ తో నడిచే జీవీఎంసీకి పాలకుడుగా ఉండడం అంటే కేబినెట్ మంత్రితో సమానంగా భావిస్తారు. దాంతో బిగ్ షాట్స్ అంతా ఈ వైపే చూస్తున్నారు. ఇక మేయర్ రేసులో ఆశావహులు పెద్ద ఎత్తున రోజు రోజుకూ వచ్చి చేరుతున్నారు. సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేల వారసులు కూడా ఈ సీటు మీదనే ఫోకస్ పెట్టేశారు. లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటి అంటే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కుమార్తె అయిన దీపికా శ్యామల కూడా మేయర్ చాన్స్ కోసం చూస్తున్నారు అని.

మహిళా రిజర్వేషన్ మీదనే :

విశాఖ మేయర్ సీటు మహిళలకు రిజర్వ్ అవుతుందని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. దానికి కారణం ఏంటి అంటే పోటీ అధికంగా ఉండడమే. మూడు పార్టీల నుంచి ఎక్కువ మంది మేయర్ అభ్యర్ధిత్వం కోరుకుంటున్నారు. దాంతో మహిళల రిజర్వేషన్ తెస్తే సగానికి పైగా సైడ్ అవుతారు అన్నది ఒకటి ఉందని అంటున్నారు. అదే సమయంలో కొందరు కీలక నేతలు తమ కుటుంబ వారసులను దించేందుకు కూడా ఈ రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు. బీజేపీ నుంచి ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి రేసులో ఉంటారు అని వార్తలు వచ్చాయి. అలాగే విశాఖ నగరంలోకి ఒక ఎమ్మెల్యే సతీమణి కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇపుడు రాజు గారి కుమార్తె సైతం ఆసక్తి కనబరుస్తున్నారు అని అంటున్నారు.

ఇప్పటికే ఎంట్రీ :

విశాఖ నార్త్ కి విష్ణు కుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన కుమార్తె తానే స్వయంగా అన్నీ చూస్తారు అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. తండ్రితో పాటుగా ఆమె కూడా పార్టీలో కీలకంగా ఉంటున్నారు. అలాగే జనంతో మమేకం అవుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు అలా వచ్చే ఎన్నికల నాటికి ఆమెను బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయించాలని రాజు గారు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆ ప్లాన్ అలా ఉండగానే ఇపుడు మేయర్ సీటు మీద మోజు పెరిగింది అని అంటున్నారు. తాజాగా ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక అయితే మహిళలకు అవకాశం వస్తే మంచిదే అని అన్నారు. మహిళకు నాయకత్వ పరంగా గట్టిగానే ఉన్నారని ఆమె అంటున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయో చూడాలని కూడా అన్నారు.

చాన్స్ ఎంత వరకూ :

విశాఖ మేయర్ ప్రత్యక్ష ఎన్నికలలో జరుగుతోంది. ఖరీదైన ఎన్నికగా దీనిని అంతా చూస్తున్నారు. అంగబలం అర్ధ బలం దండీగా ఉన్న వారే రేసులో చివరి దాకా ఉంటారని అంటున్నారు. ఇదిలా ఉంటే నూరు శాతం ఈ సీటుని టీడీపీయే తీసుకుంటుంది అని కూడా ప్రచారం సాగుతోంది. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దల నుంచి ఏమైనా ఒత్తిడి వస్తే మాత్రం బీజేపీకి చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. ఇక మహిళా రిజర్వేషన్ అయిన పక్షంలో బీజేపీ నుంచి పోటీ పడే వారిలో కచ్చితంగా రాజు గారి డాటర్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మేయర్ కి భారీ పోటీ ఉందనే అర్ధం అవుతోంది. నోటిఫికేషన్ రిలీజ్ తరువాత సీట్ల సర్దుబాటులోనే వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News