భార్యకు యానివర్సరీ గిఫ్ట్ గా ముగ్గురు యువకులను ఇచ్చిన భర్త.. సోషల్ మీడియాలో దుమారం

మనుషులు మారారు.. కాలం మారింది.. మరి వార్షికోత్సవ కానుకలు మారవంటారా? ఒకప్పుడు పెళ్లి రోజు వస్తే కంచి పట్టుచీర కాదంటే తులం బంగారం ఇచ్చేవారు.

Update: 2026-07-31 08:12 GMT

మనుషులు మారారు.. కాలం మారింది.. మరి వార్షికోత్సవ కానుకలు మారవంటారా? ఒకప్పుడు పెళ్లి రోజు వస్తే కంచి పట్టుచీర కాదంటే తులం బంగారం ఇచ్చేవారు. కాలక్రమేణా డిజిటల్ విప్లవం వచ్చి ఐఫోన్లు, హనీమూన్ ప్యాకేజీల దాకా చేరింది. కానీ సరికొత్త మోడర్న్ ప్రపంచంలో 'ట్రెండీ భర్తలు' ఇచ్చే బహుమతులు చూస్తే మాత్రం సామాన్యుడికి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. తాజాగా సోషల్ మీడియాలో విహరిస్తున్న ఒక వింత వార్తను చూస్తే.. "అయ్య బాబోయ్.. పెళ్లి అంటే ఇదేనా?" అని సగటు ప్రతివ్రతా సమేతుడు నోరెళ్లబెట్టక మానడు.

జిమ్ కబుర్లు.. వింత ఆతిథ్యాలు!

వైరల్ కంటెంట్ ప్రకారం.. ఆ ఇల్లాలు గారు ఓ ఫిట్‌నెస్ సెంటర్‌లో పనిచేస్తారట. ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మే ఆవిడగారికి భర్తగారు తన వివాహ వార్షికోత్సవ సందర్భంగా మైండ్ బ్లాక్ అయ్యే సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. జిమ్‌లో పరిచయమైన 19 ఏళ్ల యువకుడిని, అతగాడి ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించి.. భార్యకి దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చారట. ఇంతవరకు ఒకెత్తయితే ఆ సదరు మహాతల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చిన క్యాప్షన్ మరీ విచిత్రం. వారు ఎంతో ఆప్యాయంగా ఆతిథ్యమిచ్చి ‘స్వీట్ ప్రోటీన్ మిల్క్‌షేక్’ కూడా అందించారట. జిమ్ కెరీర్‌కు మిల్క్‌షేక్ బోనస్ కాబట్టి ఆవిడగారు అంతలా మురిసిపోయి ఉంటారని మన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

వ్యూస్ కోసం.. ఏమైనా చేస్తారా భయ్యా?

ఒకప్పుడు ఏ వ్యక్తిగత విషయాన్నైనా నాలుగు గోడల మధ్య దాచుకునేవారు. కానీ, ఈ 'లైక్‌లు-కామెంట్లు' యుగంలో గోడలు బద్దలైపోయాయి. పర్సనల్ లైఫ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. దానికి 'ఆర్గానిక్' రంగు పూయడం.. చివరికి దాన్నొక 'ట్రెండ్' అని కలరింగ్ ఇవ్వడం.. ఇలాంటి ఘనకార్యాలు చూస్తుంటే "వైరల్ అవ్వడానికి హద్దులు అదుపులు అవసరం లేదా?" అని విమర్శకులు తలలు పట్టుకుంటున్నారు.

నిజమా? అబద్ధమా? మనకెందుకు బాస్!

అయితే ఈ సుందరమైన కథనంలో ఎంతవరకు నిజముందో ఇంకా ఏ అధికారిక ధృవీకరణా రాలేదు. సగం సోషల్ మీడియా అంతా క్లిక్‌బైట్‌లు, ఫేక్ డ్రామాలతో నడుస్తోంది కాబట్టి ఇది నిజంగానే జరిగిందా లేక వ్యూస్ కోసం ఆడిన నాటకమా అనేది పక్కన పెడితే.. సమాజానికి మాత్రం గట్టి వినోదాన్నే అందించింది.

ఏది ఏమైనా రాబోయే రోజుల్లో వార్షికోత్సవాలకు చీరలు, నగలు అడిగితే భర్తలు దండం పెట్టి మరీ కొనిచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి వెరైటీ 'ప్రోటీన్ షేక్' సర్‌ప్రైజ్‌ల కంటే అదే పదివేలు కదా..

Tags:    

Similar News