మొన్న 35, ఈసారి 55... ప్రియుడికోసం మరో భార్య బెదిరింపులు!

ఇటీవల కాలంలో హత్యలకు బలవుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న, బెదిరింపులకు గురవుతున్న భర్తలకు సంబంధించిన పలు ఘటనలు తీవ్ర సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-06-28 19:30 GMT

ఇటీవల కాలంలో హత్యలకు బలవుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న, బెదిరింపులకు గురవుతున్న భర్తలకు సంబంధించిన పలు ఘటనలు తీవ్ర సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మొన్నటికి మొన్న మీరట్ లో ఫస్ట్ నైట్ గదిలోకి కత్తి తీసుకునివెళ్లిన నవ వధువు... తనను తాకితే 35 ముక్కలుగా నరుకుతానంటూ భర్తను బెదిరించిన సంగతి తెలిసిందే.

అనంతరం ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఆమె ఉన్నన్నాళ్లు నైట్ ఆ గదిలో పడుకోవాలంటే భయమేసేదని భర్త చెప్పడం అతనిలో ఉన్న భయాందోళనలకు అద్ధం పడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో భాగ్య... తన ప్రియుడికీ తనకూ మధ్య అడ్డొస్తే 55 ముక్కలుగా నరుకుతానంటూ బెదిరించింది. ఈ ఘటన తాజా సంచలనంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబాలో బాంద్ జిల్లాకు చెందిన ఓ మహిళ.. 2022లో శీలు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇప్పుడు ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. అయితే.. ఇంట్లోనే ఉండే ఆ మహిళ పబ్జీ ఆటకు బాగా అలవాటు పడిందంట. నిత్యం ఆ ఆటలోనే మునిగిపోయేదంట.

ఈ క్రమంలో... ఆన్ లైన్ లో తనతోపాటు పబ్జీ ఆడే శివమ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది కసతా ప్రేమగా మారిందంట. ఈ క్రమంలో... ఇక భర్త తనను తరచూ వేధిస్తాడని, కొడతాడని ఆమె తన పబ్జీ ప్రియుడు శివమ్ కు చెప్పుకోవడం మొదలుపెట్టింది. దీంతో... అతడు పంజాబ్ నుండి ఉత్తరప్రదేశ్ లోని ఆమె ఇంటికి వచ్చాడు.

ఇలా ఊహించని అతిథి తమ ఇంటికి వచ్చే సరికి సదరు మహిళ భర్తతో పాటు అతని కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. అనంతరం ఆ షాక్ నుంచి తేరుకున్న ఆమె భర్త... శివమ్ ని నిలదీశాడు. ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన సదరు మహిళ... తమ ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలుగా నరుకుతానంటూ భర్తను బెదిరించింది.

దీంతో... రెట్టింపు షాక్ కి గురైన ఆమె భర్త శివమ్ ను పోలీసులకు అప్పగించాడు. ఈ సమయంలో... అతనితో పాటు స్టేషన్ కు వెళ్లిన భార్య... తన భర్త తాగుబోతని, తనను వేధిస్తాడని ఆరోపిస్తూ తాను కూడా శివమ్ తోనే వెళ్లిపోతానని పోలీసుల ముందు చెప్పడం గమనార్హం. దీంతో.. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News