తెలంగాణా బీజేపీకి షాక్ ట్రీట్మెంట్ తప్పదా ?

ఈ మధ్యనే జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ దారుణంగా ఉందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు.;

Update: 2025-12-12 01:30 GMT

బీజేపీ ఇపుడు మంది దూకుడు మీద ఉంది. ఏ ఒక్క చాన్సూ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. బీజేపీ పొలిటికల్ డిక్షనరీలో యాంటీ ఇంకెంబెన్సీ అన్న మాటే లేదు. బీహార్ లో అది మరోసారి చూపించింది. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానాలోనూ అదే చేసి రిజల్ట్ మాదే అని సత్తా చాటింది. ఇక ఇపుడు చూపు ఇపుడు సౌత్ ఇండియా మీద ఉంది. అందులోనూ అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మరో ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్యసభ మెంబర్లు ఇలా బీజేపీకి తెలంగాణాలో మంచి బలమే ఉంది. అయినా కానీ పెర్ఫార్మెన్స్ వెరీ పూర్ అన్నట్లుగా అక్కడ పరిస్థితి తయారైంది.

క్లాస్ తీసుకున్నారా :

ఇదిలా ఉంటే తెలంగాణా బీజేపీ నేతలకు బీజేపీ అధినాయకత్వం పెద్దలు క్లాస్ తీసుకున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. లేకపోతే తెలంగాణాలో మజ్లీస్ కి ఒకే ఒక ఎంపీగా అసదుద్దీన్ ఉంటే ఆయన పెర్ఫార్మెన్స్ బాగుందని బీజేపీ పెద్దలు అనడమేంటి. ఆ స్థాయిలో కూడా బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు తమ రాజకీయ ప్రదర్శన సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు అన్నది కేంద్ర పెద్దల దృష్టిలో ఉంది అని అంటున్నారు. ఇక తెలంగాణాలో ఏమి జరుగుతోంది అన్నది బీజేపీ పెద్దలకు పూర్తిగా అర్థం అయింది అంటున్నారు. ఈ మేరకు బీజేపీకి ఉన్న నిఘా వర్గాల ద్వారా సమాచారం మొత్తం చేరింది అని అంటున్నారు. దాంతోనే తెలంగాణా బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్నారు అని ప్రచారం సాగుతోంది.

దారుణంగా ఉందా :

ఈ మధ్యనే జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ దారుణంగా ఉందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. 2023లో ఏకంగా పాతిక వేల దాకా ఓట్లు తెచ్చుకుని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన బీజేపీ తీరా ఉప ఎన్నికలు వచ్చేసరికి దారుణంగా దిగజారడం అంటే లోపం ఎక్కడ ఉందో పసిగట్టింది అని అంటున్నారు. తలో దిక్కుగా నాయకులు ఉంటున్నారు అన్నది కూడా కేంద్ర పెద్దలకు అవగాహన అయింది అని అంటున్నారు. అంతే కాదు పార్టీలో వర్గ పోరు ఆధిపత్య పోరు ఇలా అనేక రకాలుగా పోరు మాత్రమే కనిపిస్తోంది అని అంటున్నారు. ఎవరికి ఎవరికీ పడదని అందుకే పార్టీని అలా దాని మానన వదిలేస్తున్నారు అన్నది బీజేపీ పెద్దాలకు బాగా అర్థం అయింది అని అంటున్నారు.

ఏదీ కోఆర్డినేషన్ :

బీజేపీలో నాయకుల మధ్యన కో ఆర్డినేషన్ లేదని పెద్దలకు బాగా అర్ధం అయింది అని అంటున్నారు. బీజేపీలో కొత్తగా వచ్చిన నాయకులు ఉన్నారు, అలాగే మొదటి నుంచి ఉన్న వారు ఉన్నారు, వీరికీ వారికీ మధ్య పడడం లేదు అన్నది బీజేపీ పెద్దలు బాగానే గుర్తించారు అని అంటున్నారు. ఇక పార్టీలో అధ్యక్షుడిగా రామచంద్రరావుని నియమించినా ఆయనకు కనీస స్థాయిలో పార్టీ నేతల నుంచి సహకారం దక్కడం లేదని కూడా కమలం పెద్దలు అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు.

చెప్పాల్సింది అంతా :

ఈ నేపథ్యంలో తెలంగాణాలో బీజేపీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో నేతలను అందరినీ తొందరలోనే ఢిల్లీకి పిలిస్తారని కూడా అంటున్నారు. పార్టీని ఎలా గాడిన పెట్టాలో ఢిల్లీ పెద్దలకు తెలుసు అని అందుకే తమ వంతుగా ఈసారి సీరియస్ గానే యాక్షన్ లోకి దిగబోతున్నారు అని అంటున్నారు. అంతే కాదు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉందని చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News