• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యనమలకు టీడీపీ కీలక...

యనమలకు టీడీపీ కీలక బాధ్యతలు

| యనమల రామకృష్ణుడు టీడీపీలో కీలక నాయకుడు అన్నది తెలిసిందే. 1983 నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

By - Satya P
Update: 2026-05-11 04:16 GMT

యనమల రామకృష్ణుడు టీడీపీలో కీలక నాయకుడు అన్నది తెలిసిందే. 1983 నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడిగా ఎదిగి ఆయన మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక చంద్రబాబు సమకాలీనుడుగా టీడీపీలో అత్యంత ముఖ్య స్థానంలో ఉన్నారు. తాజా పొలిట్ బ్యూరోలో కూడా యనమలకు స్థానం అలాగే ఉంది ఇక యనమల రాజకీయంగా రిటైర్ అయిపోయారు ఆయనను పార్టీ దూరం పెట్టింది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆయనకు పార్టీ సముచిత స్థానం ఇస్తూ వస్తోంది. తాజాగా చూస్తే ఈ నెలలో జరగనున్న టీడీపీ మహానాడుకి సంబంధించి తీర్మానాలు ఎంతో కీలకంగా ఉంటాయి.

కన్వీనర్ గా బాధ్యతలు :

తెలుగుదేశం పార్టీ జాతీయ అంశాలను రాష్ట్ర స్థాయి అంశాలను కూడా మహానాడులో చర్చిస్తూ ఉంటుంది. ప్రతీ విషయం మీద తీర్మానాలు పెడతారు. రాజకీయ ఆర్ధిక సామాజిక అంశాల మీద తీర్మానాలు ఉంటాయి. వీటిని తయారు చేసే బాధ్యతలను సీనియర్ నేతగా యనమలకు అప్పగించారు. టీడీపీకి మార్గదర్శకుడిగా సిద్ధాంత కర్తగా వెన్నెముకగా ఉన్న యనమలకు ఇపుడు ఈ పదవిని ఇవ్వడం ద్వారా ఆయన బాధ్యతలను మరింత పెంచారని అంటున్నారు.

కూలకషంగా చర్చ :

యనమల ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితులతో పాటు ప్రాంతీయ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల రాజకీయంతో పాటు కీలకమైన ఆర్ధిక అంశాల మీద కూలంకషమైన చర్చ మహానాడులో చర్చ సాగుతుంది. దాంతో మహానాడులో ప్రతీ అంశం ఆసక్తిగా ఉంటుంది. వీటిని తయారు చేసే కమిటీకి యనమల కన్వీనర్ గా ఉంటే కో కన్వీనర్లుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, గురజాల మాల్యాద్రి, సభ్యులుగా పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, ఎస్ సవిత, ఎం ఏ షరీఫ్, నక్క ఆనందబాబు, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, పి అశోక్ బాబు, పంచుమర్తి అనూరాధ, పి క్రిష్ణయ్య, ఎస్ విజయ్ కుమార్, సిరివేరు కాశీనాధ్, సోమ భూపాల్ రెడ్డి, నెల్లూరి దుర్గా ప్రసాద్ వ్యవహరిస్తారు.

ప్రతిష్టాత్మకంగా :

ఈసారి మహానాడుని టీడీపీ నెల్లూరు వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతున్న ఈ సమావేశం పైన అందరి దృష్టి ఉంది. దాంతో మహానాడు ఏ విషయాల మీద తీర్మానాలు చేస్తుంది అన్నది కూడా చూస్తున్నారు. యనమల అనుభవంతో సభ్యుల సలహా సూచనలతో ఏ తీర్మానాలు రూపొందిస్తారు అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి యనమలకు టీడీపీ టాప్ ప్రయారిటీ ఇస్తోంది. వచ్చే నెలలో రాజ్యసభ సీట్లలో ఒకటి ఆయనకు దక్కుతుందా అన్న చర్చ కూడా నడుస్తోంది.

Tags:    
  • tdp 
  • yanamalaramakrishnudu 
  • mahanadu 
  • chandrababunaidu 
  • naralokesh 
  • andhrapradesh 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS