ఆ జ‌న‌సేన‌ ఎమ్మెల్యే ల‌క్కీనా.. ?

ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, తాజా పరిస్థితిని గ‌మ‌నిస్తే.. ఎమ్మెల్యే ల‌క్కీనే అన్న‌ట్టుగా ఉంది. ప్రస్తుత శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ కు తిరుగులేద‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Update: 2026-09-28 14:30 GMT

ఉమ్మ‌డి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాలు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధిప‌త్యం సాగిస్తోంది. ప్రతిపక్షం వైసీపీ పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌ని టాక్ న‌డుస్తోంది. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ స్థానం రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, తాజా పరిస్థితిని గ‌మ‌నిస్తే.. ఎమ్మెల్యే ల‌క్కీనే అన్న‌ట్టుగా ఉంది. ప్రస్తుత శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ కు తిరుగులేద‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

జ‌న‌సేన పార్టీ నుంచి 2024లో తొలిసారి పోటీ చేసిన ఆయ‌న‌.. ఫ‌స్ట్ టైమే గెలుపు గుర్రం ఎక్కారు. నాటి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం బొలిశెట్టి అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కూటమి రాజకీయాలను ముందుకు తీసుకువెళ్ల డంలో బొలిశెట్టి కీల‌కంగా వ్య‌వ‌హరిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి పట్టు బలంగా ఉంది. ఎమ్మెల్యే బొలిశెట్టి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు మరియు స్థానిక సమస్యల పరిష్కార కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.

అయితే, స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటు, ఇతర రాజకీయ పరిణామాల్లో జనసేన, టీడీపీ నేతల మధ్య కొన్ని సందర్భాల్లో అంతర్గత చర్చలు, భేటీలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. కూట‌మికి భంగం క‌ల‌గ‌కుండానే జ‌న‌సేన పార్టీ దూకుడు పెంచేలా ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. బొలిశెట్టికి నియోజ‌క‌ర్గంలో పెద్ద‌గా వ్య‌తిరేకత లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సొంత పార్టీ నుంచి మిత్ర‌ప‌క్షాల వ‌ర‌కు కూడా శ్రీనివాస్ పై సానుకూలంగానే ఉన్నారు. ఇది ఆయ‌న‌కు ఎంత‌గానో క‌లిసి వ‌స్తోంది.

ఇక‌, వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే కొట్టు స‌త్య‌నారాయ‌ణ గత ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత, పార్టీ కి దూరంగానే ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ అధినేత జ‌గ‌న్ నియోజకవర్గంలో క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు, ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త ఇన్చార్జ్‌గా వ‌డ్డి ర‌ఘురామ్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇది కొట్టుకు న‌చ్చ‌డం లేదు. క‌నీసం త‌న‌ను సంప్ర‌దించ కుండానే ఇలా చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలు కొన‌సాగుతున్నా యి. ఫ‌లితంగా పార్టీ యాక్టివ్ పాలిటిక్స్ చేయ‌లేక పోతోంది. ఇది కూడా ఎమ్మెల్యే బొలిశెట్టికి క‌లిసివ‌స్తోంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News