ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య.. కారణమేంటి?

తెలుగు జర్నలిజం ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన వార్త... న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆకస్మిక మరణం.;

Update: 2025-06-28 04:49 GMT

తెలుగు జర్నలిజం ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన వార్త... న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆకస్మిక మరణం. ధైర్యం, నిజాయితీ, సామాజిక బాధ్యతకు నిలువెత్తు రూపమైన స్వేచ్ఛ ఇంత అమాయకంగా జీవితం ముగించుకుందా అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఆమె మరణం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? ఇది ఆత్మహత్యేనా? ఆమె మరణానికి కారణం ఏంటన్న ప్రశ్నలు ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

స్వేచ్ఛ తన జర్నలిస్టిక్ కెరీర్‌ను ఓ ప్రముఖ టాప్ ఛానెల్‌లో ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగారు. న్యూస్ ప్రెజెంటర్‌గా మాత్రమే కాకుండా, మానవీయ అంశాలను వెలికి తీయడంలో ఆమెకి ఉన్న ప్రత్యేకత ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల సమస్యలపై ఆమె చేసిన కథనాలు ఎంతో మంది హృదయాలను తాకాయి. ఆమె టీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా సేవలందించారు. అయితే వృత్తిపరంగా ఎంతో ధైర్యంగా వ్యవహరించిన స్వేచ్ఛ, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు ఇప్పుడు సమాచారం వస్తోంది. ఆమెకు ఒక కుమార్తె ఉన్నది. గతంలో భర్తతో విడాకులు తీసుకున్నది, తాజాగా ఓ మాజీ సహచరుడితో సహజీవనం కొనసాగిస్తోందని మీడియా వార్తలు వస్తున్నాయి. అతడితో దిగిన ఫొటోలను చనిపోవడానికి ఒకరోజు ముందు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ‘మనసును కామ్ గా ఉంచుకో ఆత్మనే మాట్లాడుతుంది’ అని ఆమె చివరకు కొన్ని ఫొటోలు షేర్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఫొటోల్లోని వ్యక్తితో ఇటీవల విభేదాలు పెరిగినట్టు సన్నిహితులు చెబుతున్నారు.

- చిక్కడపల్లిలో ఆ విషాదం..

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి ప్రాంతంలోని జవహర్‌నగర్‌లో తన కుమార్తెతో కలిసి నివసించిన స్వేచ్ఛ, అదే ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నా, పోలీసులు మాత్రం దీనిని అనుమానాస్పద మరణంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు.

-పోలీసుల దర్యాప్తు.. కీలక అనుమానాలు

స్వేచ్ఛ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే వ్యక్తితో విభేదాలే ఆమెను ఇంత దారుణ నిర్ణయం తీసుకునేలా చేశాయా? లేక మరెవరో ఈ మృతికి కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆ వ్యక్తి ఆమె నివాసానికి రాకపోవడం, స్వేచ్ఛ తన సన్నిహితులకు కొన్ని విషయాలు చెప్పినట్టు సమాచారం ఉండటం ఈ కేసును మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి.

- తెలుగు మీడియా రంగానికి తీరని లోటు

జర్నలిస్టు వృత్తిలో మహిళగా ఎదగడం, సమస్యలతో ఎదురుదెబ్బ తింటూ నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు. కానీ స్వేచ్ఛ అందుకు నిదర్శనంగా నిలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆమె ముందువరుసలో ఉండి పోరాడిన ధైర్యవంతురాలు. ఆమె మరణ వార్త తోటి జర్నలిస్టులకు నిస్సహాయతను కలిగిస్తోంది. ఇది తెలుగు మీడియా రంగానికి తీరని లోటు. స్వేచ్ఛ మృతి వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నారు.

ఒక తన సహజీవన భాగస్వామితో విడిపోతున్నానని.. వెంటనే రావాలంటూ తండ్రికి ఫోన్ చేసిన స్వేచ్ఛ అనంతరం డ్యూటీకి వెళ్లిపోయింది. తర్వాత రోజే ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె భాగస్వామి వల్లే తన కూతురు స్వేచ్ఛ చనిపోయినట్టు స్వేచ్ఛ తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. పోలీసుల విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయి..

Full View
Tags:    

Similar News