రేవంత్ కు కోపమొచ్చింది.. రివ్యూ పెట్టి మరీ కడిగేశారు

వర్షాకాలం ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు వర్షాలు పడతాయన్న విషయాన్ని వాతావరణ సంస్థల నుంచి వచ్చే నివేదికలు స్పష్టం చేస్తున్నా.. అందుకు తగినట్లుగా వ్యవస్థలు సిద్ధం కాకపోవటం చూస్తున్నదే.

Update: 2026-06-15 08:30 GMT

వర్షాకాలం ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు వర్షాలు పడతాయన్న విషయాన్ని వాతావరణ సంస్థల నుంచి వచ్చే నివేదికలు స్పష్టం చేస్తున్నా.. అందుకు తగినట్లుగా వ్యవస్థలు సిద్ధం కాకపోవటం చూస్తున్నదే. హైదరాబాద్ మహానగర పరిధిని ‘క్యూర్’గా (కోర్ అర్బన్ రీజియన్) విస్తరించిన వేళ.. భారీ వర్షాలు పడినప్పుడు నగర వాసులకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేయటంలో వివిధ విభాగాలు ఫెయిల్ అయిన వైనంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సైబరాబాద్ తో సహా అనేక ప్రాంతాల్లో రోడ్లను వరద ముంచెత్తి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావటం.. నగర వాసులు తీవ్ర అవస్థలకు గురి కావటమే కాదు.. పలుచోట్ల చెట్లు కూలిపోవటం.. విద్యుత్ సరఫరా నిలిచిపోవటం.. లాంటి ఉదంతాలపై ఆయన సీరియస్ అయ్యారు.

వర్షాకాల సన్నద్ధతపై జూన్ 1న జరిపిన రివ్యూలో అధికారులు.. సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాలని తాను అనేక సూచనలు చేసినా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తాను సహించలేనని స్పష్టం చేయటంతో పాటు.. ఈ నెల తొమ్మిదిన కురిసిన భారీ వర్షం వేళ.. మున్సిపల్.. పోలీసు అధికారుల మద్య సమన్వయం లోపించిందంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు. దీనికి కారణాల్ని విశ్లేషించి.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని.. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం రేవంత్.

వర్షాలు పడే వేళలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు వీలుగా ఉన్నతాధికారులురోడ్ల మీదకు రావాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. పోలీసు కమిషనర్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు రోడ్ల మీదకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. అవసరమైతే తాను కూడా రోడ్లపైకి వస్తానని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అంతేకాదు.. ట్రాఫిక్ విభాగంలో ఖాళీలను డీజీపీ తక్షణం భర్తీ చేయాలని ఆదేశించారు. మానవ తప్పిదాలతో సమసయలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని స్పష్టం చేశారు. సీఎం రేవంత సీరియస్ అయిన వేళ.. తదుపరి వర్షాల వేళకు.. అధికారులు సిద్ధమవుతారా? లేదంటే.. ఇప్పటి నిర్లక్ష్యాన్ని.. అలసత్వాన్ని కంటిన్యూ చేస్తారా? అన్నది చూడాలి.

Tags:    

Similar News