సీజేపీ పై బీజేపీ వ్యూహం ఏమిటి...కఠిన చర్యలకు రెడీనా ?

సీజేపీ పేరుతో వీధుల్లోకి వస్తున్న జెన్ జీ యువత అంతా ఒక్కటేనా. మొత్తం జెన్ జీ అంతా సీజేపీ వెంట ఉన్నారా.

Update: 2026-10-12 09:30 GMT

సీజేపీ పేరుతో వీధుల్లోకి వస్తున్న జెన్ జీ యువత అంతా ఒక్కటేనా. మొత్తం జెన్ జీ అంతా సీజేపీ వెంట ఉన్నారా. వారంతా కూడా కేంద్రం మీద కసిగా ఉన్నారా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా నుంచి దేశ రాజకీయాల మీద జెన్ జీ ఆసక్తి ఉందా ఇవన్నీ ప్రశ్నలు. నిజానికి సీజేపీ వెంట జెన్ జీ మొత్తం ఉందా అంటే అది కాదనే జవాబు వస్తుంది. నీట్ పరీక్షలు అంటే అవి పూర్తిగా విద్యార్ధులకు సంబంధించిన అంశం. ఇపుడు రాజకీయ అజెండాను సీజేపీ తీసుకుంది. సీఈసీ రాజీనామా అంటోంది. అటు తిరిగి ఇటు తిరిగి నేరుగా నరేంద్ర మోడీనే రాజీనామా చేయమంటోంది. మరి ఇవన్నీ జెన్ జీ భావాలే అని అనుకోవాలా అంటే ఆలోచించాల్సిందే మరి.

బీజేపీ మౌనం :

ఇక సీజేపీ ఆందోళనను అదుపు చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం సీజేపీ విషయంలో మాత్రం మౌనంగానే ఉంది. ఆ మౌనం వెనక వ్యూహం ఉందని అంటున్నారు. ఈ రోజున సీజేపీలో ఉన్న కీలక నాయకులు అంతా ఆప్ లో పనిచేసిన వారే అన్నది తెలిసిందే. వారిని తెర వెనక ఉండి అజెండా సెట్ చేసి ఆడిస్తున్నారా అన్నది దేశాన్ని నడుపుతున్న కేంద్ర పెద్దలకు తెలియనిది కాదని అంటున్నారు. ఒక వైపు ఆప్ నుంచి నినాదాలు ప్రకటనలు వస్తాయి, మరో వైపు చూస్తే సీజేపీ నుంచి పోరాట జోరు కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ ఇతర పార్టీలు ఎత్తుకున్న అజెండా సీజేపీ నిరసనలతో మరో మలుపు తిప్పాలని ఎవరు అనుకుంటున్నారు అన్నది కూడా కీలకమైన ప్రశ్న. ఈ దేశంలో ప్రజా స్వామ్యం లేదా ఉద్యమాలు చేయకూడదా అంటే చేయవచ్చు కానీ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసేలా ఉండరాదు అన్నదే కదా అంతా చెబుతున్నది. సీజేపీ తమ నిరసనల విషయంలో ఈ రకమైన హామీ ఇవ్వలేకపోతోంది అని అంటున్న వారూ ఉన్నారు. ఇక జెన్ జీకి ముడిపెడుతూ సీజేపీ ఉద్యమాన్ని బూచిగా చూపించే ప్రయత్నం కూడా జరుగుతోందని అంటున్నారు. మరి ఆ రాజకీయం ఎవరిది అన్నది మరో ప్రశ్న.

సీజేపీ మీద యాక్షన్ :

ఈ నేపథ్యంలో సీజేపీ మీద యాక్షన్ తీసుకుంటే జెన్ జీ ఆశలను ఆకాంక్షలను నొక్కినట్లు కాదా అన్నది మరి కొందరు సంధిస్తున్న ప్రశ్న. సీజేపీకి జెన్ జీకి సంబంధం ఏమిటి అని ప్రశ్నించే వారూ ఉన్నారు. అయితే ఈ దేశంలో మెజారిటీ యువత ఎపుడూ అరాచకం కోరుకోదు అని చెబుతున్న వారూ ఉన్నారు. ఈ క్రమంలో అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్‌గఢి ఆలయ మహంత్ రాజూదాస్ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై తీవ్రంగా స్పందించారు. నిరసనల్లో పాల్గొంటున్న జెన్ జీ‌పై ప్రధాని నరేంద్రమోడీ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తాజాగా డిమాండ్ చేయడం విశేషం. జెన్ జీ యువత అంటే ఆయన అర్థం చేప్పారు. యువత దేశాన్ని ఏకం చేయాలి కానీ విభజించేంది కానే కాదని అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలని భావించే యువతపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తామంతా ప్రధాని మోడీ వెంటే ఉంటామని అన్నారు. భారతదేశం ముక్కలవుతుందని నినాదాలు చేసే యువత ఎవరైన వారంతా దేశద్రోహులు మత ద్రోహులు అవుతారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ దేశాన్ని ఏకం చేసే యువత అందరికీ కావాలని అన్నారు. మరి ఈ డిమాండ్ పైన కేంద్రం స్పందిస్తుందా మోడీ ప్రభుత్వం సీజేపీ మీద కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందా అంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News