జంతర్ మంతర్ కోసం సీజేపీ....2.0 అంటూ మొదలెడితే ?

జంతర్ మంతర్ వేదిక కావాలని కాక్రోచ్ పార్టీ గట్టిగా కోరుతోంది. అది అచ్చి వచ్చిన ప్రాంతం కావడంతో సీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని చెబుతోంది.

Update: 2026-10-12 06:16 GMT

జంతర్ మంతర్ వేదిక కావాలని కాక్రోచ్ పార్టీ గట్టిగా కోరుతోంది. అది అచ్చి వచ్చిన ప్రాంతం కావడంతో సీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని చెబుతోంది. తాము నిరసనలు అన్నీ అక్కడే చేస్తామని అంటోంది. గతంలో అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతామని సీజేపీ ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అందుకు అనుమతించలేదు. ఏది ఏమైనా అక్కడే తాము నిరసన దీక్షలు చేస్తామని సీజేపీ ప్రకటించడంతోనే శనివారం అంతా ఢిల్లీలో వేలాది పోలీసులతో దిగ్బంధనం చేశారు. ఇపుడు చూస్తే మళ్ళీ సీజేపీ మరో సారి ఢిల్లీ పోలీసులకు అప్లికేషన్ పెట్టింది.

అల్టిమేటం సైతం :

జంతర్ మంతర్ వద్దనే తాము ఆందోళన చేపడతామని పట్టుదలగా ఉన్న సీజేపీ ఢిల్లీ పోలీసులను ఇదే విషయం మీద గట్టిగా పట్టుబడుతోంది. తాము అక్కడ శాంతియుత నిరసన చేపట్టేందుకు అనుమతించాలని కోరుతోంది. సీజేపీ చేపట్టబోయే నిరసనకు తేదీని అలాగే వేదికను ఇరవై నాలుగు గంటలలోనా ఖరారు చేయాలని దిల్లీ పోలీసులను సీజేపీ కోరారు. అనుమతి ఇవ్వకపోతే తామే మరో నిరసనకు పిలుపునిస్తామని సీజేపీ నేతలు తేల్చి చెప్పడం విశేషం. దాంతో ఢిల్లీ పోలీసులు ఏమి చేస్తారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. నినాజికి జంతర్ మంతర్ తో సీజేపీ నిరసనలకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే.

ఒక్కసారి కనుక మొదలెడితే :

జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు కానీ ఆ పార్టీ మద్దతుదారులు కానీ ఒక్కసారి నిరసనలు చేపడితే ఏమవుతుంది అన్నది అందరికీ తెలిసిందే. అది రోజుల తరబడి సాగుతుంది. ఒకసారి నిరసన పిలుపు ఇచ్చాక అది సీజేపీ చేతులలో కూడా ఉండదు, వ్యవస్థీకృతం కాని సీజేపీని ఎవరూ నియంత్రించే పరిస్థితి ఉండదు అని అంటున్నారు. ఇక అరాచక శక్తులు అసాంఘీక శక్తులు కూడా ఈ ముసుగులో సీజేపీ ఉద్యమంలోకి ప్రవేశిస్తున్నాయని జూలై ఆందోళనలో పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు గమనించే ఆ ఉద్యమాన్ని కేంద్ర మంత్రి రాజీనామాతో ఆపించగలిగారు. ఈసారి కూడా ఉద్యమం అంటే కచ్చితంగా మరింత వేడిని వాడిని రాజేస్తుందని పోలీస్ వర్గాలతో పాటు పొలిటికల్ వర్గాలు కూడా అంటున్నాయి. ఇక కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అయితే ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమని భావిస్తోంది. ఢిల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. దాంతో సీజేపీ ఆందోళనకు ఈసారి జంతర్ మంతర్ వేదిక దక్కడం అంత సులువు కాదని అంటున్నారు.

సీజేపీ హెచ్చరికలు :

అయితే సీజేపీ కూడా పట్టుదలగా ఉంది. తమకు జంతర్ మంతర్ వేదికను అనుమతించాలని కోరుతోంది. శాంతియుతంగా నిరసన చేస్తామని అంటోంది. అలా అనుమతించకపోతే మరో రూపంలో నిరసనలు ఉంటాయని కూడా హెచ్చరిస్తోంది. మరి మరో రూపంలో నిరసనలు ఎలా ఉంటాయి ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే సీజేపీకి నీట్ పరీక్షా పత్రల లీక్ తరువాత సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా ఇష్యూ వేడిని రగిలించే మరో అతి పెద్ద మ్యాటర్ గా మారింది అని అంటున్నారు. అసలే అక్టోబర్ 10న జంతర్ మంతర్ నిరసనలు ఆపేశారు అన్న ఆగ్రహంతో సీజేపీ ఉంది. చూడాలి మరి ఢిల్లీ పోలీసులు ఏమి చేస్తారో సీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది.

Tags:    

Similar News