కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి: రాజాసింగ్ సంచలన కామెంట్స్
తెలంగాణ రాజకీయ నాయకుడు, బీజేపీకి రాజీనామా చేసిన ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.;
తెలంగాణ రాజకీయ నాయకుడు, బీజేపీకి రాజీనామా చేసిన ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కీలక నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంగా ఆయన వ్యాఖ్యలు సంధించారు. కిషన్ రెడ్డి వల్లే పార్టీ నాశనం అయిం దన్న వాదన ఉందని వ్యాఖ్యానించారు. ఆయన తన ఎంపీ సీటుకు రాజీనామా చేస్తే.. తాను ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తా నని తెలిపారు. అప్పుడు ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేద్దామని, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో అప్పుడు తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని కొందరు అన్ని విధాలా భ్రష్టు పట్టించారని రాజా సింగ్ విమర్శలు గుప్పించారు.
బీజేపీలోని రాష్ట్ర నేతలు.. తనకు ఎప్పుడూ సహకరించలేదని రాజా సింగ్ చెప్పారు. అందుకే.. తాను పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. అయినా.. తను బాధపడడం లేదన్న ఆయన పార్టీలో ఉన్నప్పుడు .. కొందరిలాగా తాను లాబీయిం గులు చేసుకుని పదవులు తెచ్చుకోవాలని ఆలోచన కూడా చేయలేదన్నారు. అయినప్పటికీ.. తాను బీజేపీ నాయకుడిగానే ఉన్నానన్నారు. తాను లౌకిక వాద నాయకుడిని కాదని రాజా సింగ్ చెప్పారు. తాను ఇప్పటికీ బీజేపీకి అనుకూల నాయకుడి నేనని తెలిపారు. కేంద్రంలోని పెద్దలతో తనకు ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయని.. పలువురు కీలక నాయకులు తనకు తరచుగా ఫోన్లు చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను వారికి వివరిస్తానని రాజాసింగ్ తెలిపారు. తాను పార్టీకి రాజీనామా చేసినప్పుడు.. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ తనకు పోన్ చేసి మందలించారని.. పార్టీకి రాజీనామా ఎందుకు చేశావని నిలదీశారని.. అది ఆయనకు తనపై ఉన్న అభిమానమని రాజా సింగ్ చెప్పారు. అందుకే తాను పార్టీని, పార్టీ పెద్దలను కూడా గౌరవిస్తున్నానని అన్నారు. కానీ, స్థానికంగా ఉన్న నాయకుల తీరు మారకపోతే.. బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం దీనిపై ఆలోచన చేయాలన్నారు.
తాను పార్టీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. కానీ, స్థానికంగా ఉన్న నాయకులు ఇతర పా ర్టీల నేతలతో మిలాఖత్ అయి.. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని.. అందుకే తాను ఆవేదన చెందానని రాజా చెప్పారు. ఇక, తన భవిష్యత్తు రాజకీయాలపై స్పందిస్తూ.. తాను ఇతర పార్టీల్లో చేరబోనన్నారు. బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఆహ్వానాలు అందిన మాట వాస్తవమేనన్న ఆయన.. అయినా.. ఆ పార్టీలోకి చేరేది లేదన్నారు. బీజేపీ పెద్దలు పిలిస్తే.. వెళ్లి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తానన్నారు. అనంతరం.. తన భవిష్యత్తును నిర్ణయించుకుంటానని చెప్పారు.