టార్గెట్ జ్ఞానేష్ మారిందా? రాహుల్ తాజా వ్యాఖ్యలు విన్నారా?

ఇప్పటివరకు తనలోని కనిపించని కోణాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చూపిస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తున్న పరిస్థితి.

Update: 2026-10-19 09:48 GMT

ఇప్పటివరకు తనలోని కనిపించని కోణాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చూపిస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తున్న పరిస్థితి. సర్ లో 13 కోట్ల ఓట్ల చోరీ జరిగిందన్న నినాదంతో నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న రాహుల్ గాంధీ.. గతానికి భిన్నంగా చాలా దూకుడుగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఇప్పటివరకు ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామాను ప్రధాన ఎజెండా తీసుకొని ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా తమ టార్గెట్ ను మరింత విస్తరించిన వైనాన్ని వెల్లడించటమే కాదు.. రాబోయే రోజుల్లో తామేం చేయాలనుకుంటున్న విషయాన్ని తాజాగా తాను చేసిన వ్యాఖ్యలతో రాహుల్ చెప్పకనే చెప్పేశారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

తాజాగా గోవాలో మూడు రోజుల పాటుగోయ్ రఖోన్ యాత్రను నిర్వహించారు. దీని ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. తమ తర్వాతి రాజకీయ ఎత్తుగడను బహిరంగంగా చెప్పేశారని చెప్పాలి. ‘మీరేం కంగారుపడకండి. గోవా గురించి మీరు చూసుకోండి. ఢిల్లీలో ఉండి ప్రధాని మోడీ.. హోం మంత్రి అమిత్ షాల విషయం మేం చూసుకుంటాం. వాళ్లకు సమయం దగ్గర పడింది’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఇదంతా చూస్తే.. సర్ లో 13 కోట్ల ఓట్ల చోరీ జరిగిందని దీనికి బాధ్యత వహించాలని ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ను ఇంతకాలం టార్గెట్ చేసిన దానికి కొనసాగింపుగా ప్రధాని మోడీ.. అమిత్ షాలను టార్గెట్ చేసేందుకు అవసరమైన కార్యాచరణ విషయంలో రాహుల్ పూర్తిస్థాయి స్పష్టతతో ఉన్నట్లుగా కనిపించకమానదు. అదే జరిగితే.. అందుకు మిగిలిన రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News