జగన్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రద్దుపై ట్రిపుల్ ఆర్ సంచలన వ్యాఖ్యలు!

అవును... వైసీపీ నేతలు, ముఖ్యంగా వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై ఉప శాసనసభాపతి రఘురామ కృష్ణంరాజు తాజాగా స్పందించారు.;

Update: 2025-10-24 04:24 GMT

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒక్క వైసీపీనే అని.. మిగిలిన మూడూ అధికారపార్టీలేనని.. అందువల్ల తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు స్పీకర్ అంగీకరించకపోవడ లేదనే కారణాన్ని చూపిస్తూ జగన్ & కో అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. ఈ సమయంలో ఈ గైర్హాజరీపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... వైసీపీ నేతలు, ముఖ్యంగా వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై ఉప శాసనసభాపతి రఘురామ కృష్ణంరాజు తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా... జగన్ తనకు భయపడి అసెంబ్లీకి రావడంలేదని తాను అనుకోవడం లేదని చెప్పిన రఘురామ.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననే వాదనలో ఆయన ఉన్నారని.. అయితే, అది నిలబడని వాదమని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో.. ప్రతిపక్ష హోదా వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో మూడున్నర సంవత్సరాలు ఆగాలని.. ఈ లోపు మాత్రం ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదని అన్నారు. అయితే.. ఆయన అసెంబ్లీకి వస్తే ప్రజలకు మంచిదని.. ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోయినా.. ప్రధాన ప్రతిపక్షానికి ఆయన నాయకుడని రఘురామ తెలిపారు. ఆయన ఇంట్లో ఆయన మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదని అన్నారు.

60 రోజులూ రాకపోతే చేయగలిగేదేమీ లేదు!:

ఇక.. జగన్ మరో 25 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే, అప్పుడు వరుసగా మొత్తం 60 రోజులు గైర్హాజరైనట్లు ఉంటుందని, ఆ తర్వాత చేయగలిగేది ఏమీ ఉండదని అన్నారు. గతంలో చంద్రబాబు చివరి రెండేళ్లు సమావేశాలకు రాలేదు కదా అనే వాదన ఉన్నప్పటికీ.. అప్పుడు అసెంబ్లీ జరిగిన పనిదినాలు 35 రోజులకు మించి లేవని స్పష్టం చేశారు. 60 రోజులు వరుసగా రానప్పుడే (ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రద్దు) రూలు అప్లై అవుతుందని తెలిపారు.

పవన్ ఫ్యాన్స్ అపార్థం చేసుకున్నారు!:

ఇదే సమయంలో భీమవరం డీఎస్పీ వ్యవహారంపై జరుగుతున్న ఇష్యూపైనా రఘురామ స్పందించారు. ఇందులో భాగంగా... భీమవరం డీఎస్పీని తాను సపోర్టు చేయడం లేదని.. తన దగ్గర ఉన్న సమాచారం మేరకే ఆయన గురించి మాట్లాడానని అన్నారు. భీమవరం డీఎస్పీపై తనకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని.. తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని, తన పరిధిలోని అధికారి పనితీరును బాగున్నప్పుడు చెప్పడం తన బాధ్యత అని రఘురామకృష్ణరాజు తెలిపారు!

ఈ విషయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిమానులు తనను అపార్థం చేసుకున్నారని, విచారణలో నిజాలు తేలుతాయని చెప్పిన రఘురామ... తనకు వచ్చిన సమాచారం తప్పు కావచ్చునని, పవన్ కల్యాణ్‌ కు వచ్చిన ఫిర్యాదులు సరైనవి కావచ్చని అన్నారు!

Tags:    

Similar News