అన్ని మతాలు కలవాలి: పురందేశ్వరి పిలుపు
దేశం యావత్తు.. పాకిస్థాన్‌తో జరుగుతున్న దాడులపై ఉద్విగ్నంగా ఉంది. భారత్‌దే పైచేయి కావాలని కూడా కోరుకుంటోంది.;
దేశం యావత్తు.. పాకిస్థాన్‌తో జరుగుతున్న దాడులపై ఉద్విగ్నంగా ఉంది. భారత్‌దే పైచేయి కావాలని కూడా కోరుకుంటోంది. ఎవరికి తోచిన రీతిలో వారు.. దేశానికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇదిలావుంటే.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి కీలక ప్రకటన చేశారు. తాజాగా రాష్ట్ర బీజేపీ నాయకులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ పూజలకు పిలుపునిచ్చారు. దీనికి మతంతో పనిలేదని కూడా చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సైన్యం, దేశం కోసం ప్రార్థనా మందిరాలు, దేవాలయాలలో రేపటి నుంచి రెండు రోజుల పాటు పూజలు నిర్వహించాలని ఆమె దిశానిర్దేశం చేశారు. దీనిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. ఈ పూజల్లో దేశం కోసం, సైనికుల కోసం ప్రార్థించాలని కోరారు. భారత సైన్యం సాహసోపే తంగా పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసిన తీరును ఆమె వివరించారు. అయితే.. ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొందన్నారు.
భారత పౌరులపై పాకిస్థాన్ అకారణంగా కాల్పులు జరిపి వారిని పొట్టన పెట్టుకుందన్న పురందేశ్వరి.. పాక్ తో మన పోరాటం కొనసాగినంత కాలం దేశం కోసం.. సైనికుల కోసం పూజలు చేయాలని పిలుపునివ్వడం గమనార్హం. అంతేకాదు.. ఇప్పటివరకు దూరం పెట్టిన క్రిస్టియన్ సామాజిక వర్గం.. ముస్లిం సామాజిక వర్గాలకు కూడా ఆమె పిలుపు నివ్వడం గమనార్హం. దేశం సురక్షితంగా ఉండాలని ప్రార్థనలు, పూజలు చేయాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు. మరి ఆమె పిలుపు ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.అన్ని మతాలు కలవాలి: పురందేశ్వరి పిలుపు
దేశం యావత్తు.. పాకిస్థాన్‌తో జరుగుతున్న దాడులపై ఉద్విగ్నంగా ఉంది. భారత్‌దే పైచేయి కావాలని కూ డా కోరుకుంటోంది. ఎవరికి తోచిన రీతిలో వారు.. దేశానికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇదిలావుంటే.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి కీలక ప్రకటన చేశారు. తాజాగా రాష్ట్ర బీజేపీ నాయకులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ పూజలకు పిలుపునిచ్చారు. దీనికి మతంతో పనిలేదని కూడా చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సైన్యం, దేశం కోసం ప్రార్థనా మందిరాలు, దేవాలయాలలో రేపటి నుంచి రెండు రోజుల పాటు పూజలు నిర్వహించాలని ఆమె దిశానిర్దేశం చేశారు. దీనిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. ఈ పూజల్లో దేశం కోసం, సైనికుల కోసం ప్రార్థించాలని కోరారు. భారత సైన్యం సాహసోపే తంగా పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసిన తీరును ఆమె వివరించారు. అయితే.. ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొందన్నారు.
భారత పౌరులపై పాకిస్థాన్ అకారణంగా కాల్పులు జరిపి వారిని పొట్టన పెట్టుకుందన్న పురందేశ్వరి.. పాక్ తో మన పోరాటం కొనసాగినంత కాలం దేశం కోసం.. సైనికుల కోసం పూజలు చేయాలని పిలుపునివ్వడం గమనార్హం. అంతేకాదు.. ఇప్పటివరకు దూరం పెట్టిన క్రిస్టియన్ సామాజిక వర్గం.. ముస్లిం సామాజిక వర్గాలకు కూడా ఆమె పిలుపు నివ్వడం గమనార్హం. దేశం సురక్షితంగా ఉండాలని ప్రార్థనలు, పూజలు చేయాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు. మరి ఆమె పిలుపు ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.