• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సిక్కులు త్యాగ‌ధ‌నులు: ...

సిక్కులు త్యాగ‌ధ‌నులు: టైం చూసి మోడీ ప్ర‌శంస‌లు!

| మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ సిక్కుల సేవలు, త్యాగాలను కొనియాడారు. గురునానక్ బోధనలు, ప్రకాశ్ పర్వదినం గురించి ప్రస్తావించారు. కెనడాలో ఫుడ్ బ్యాంక్ ద్వారా వేలాది మందికి సాయం చేస్తున్న కుల్విందర్ సంఘేరాను ప్రశంసించారు. త్వరలో పంజాబ్ ఎన్నికలు ఉండటంతో మోడీ వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

By - Garuda Media
Update: 2026-11-29 17:30 GMT

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ఏం చేసినా దానికో టైమింగ్ ఉంటుంది. తాజాగా ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన మ‌న్‌కీ బాత్ ప్ర‌సంగంలో అనూహ్యంగా సిక్కుల‌ను ఉద్దేశించి.. వారి సేవ‌ల‌ను, త్యాగాల‌ను ఆకాశానికి ఎత్తేశా రు. అంతేకాదు.. దేశ విదేశాల్లోనూ సిక్కు స‌మాజం భార‌త దేశ ఉనికిని చాటుతున్నార‌ని కొనియాడారు. ``నా ప్రియమైన దేశప్రజలారా`` అంటూ.. సిక్కుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. సిక్కులు ప‌విత్రంగా జ‌రుపుకొనే `ప్రకాశ పర్వదినాన్ని` ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఢిల్లీలోని శబద్ కీర్తనలో పాల్గొనే అవకాశం త‌న‌కు లభించిందన్నారు. అంతేకాదు.. సిక్కు గురువుల చిత్రాలను చూస్తే మనసు శ్రధ్ధతో నిండిపోతుందని పేర్కొన్నారు. సిక్కు గురువుల తాలుకూ చిత్రాలను తయారుచేసిన గొప్ప కళాకారులు అంటూ.. శోభా సింహ్ అనే క‌ళాకారుడిని(ఇప్పుడు లేరు. కానీ, సిక్కులు ఆయ‌న‌ను ఐకాన్‌గా భావిస్తారు) మెచ్చుకున్నారు. ఆయన గౌరవార్థం స్మారక నాణెం విడుదల చేశామ‌ని, ఇది సిక్కుల‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని కూడా ప్ర‌ధాని చెప్పుకొచ్చారు.

ఇక‌, ఈ సంద‌ర్భంలోనే మ‌రో విష‌యాన్ని కూడా ప్ర‌ధాని వివ‌రించారు. వివిధ దేశాలలో జరుగుతున్న సేవాకార్యక్రమాల గురించి చెబుతూ.. కెనడాలో సాయీధామ్ ఫుడ్ బ్యాంక్‌ను నిర్వ‌హిస్తున్న సిక్కు వ్య‌క్తి కుల్విందర్ సంఘేరా గురించి ప్ర‌స్తావించారు. ప్రతి నెలా గ్రేటర్ టోరెంటో లోనూ, హేమిల్టన్ లోనూ దాదాపు అరవై వేలమంది ప్రజలకు ఆయ‌న సాయం చేస్తున్నార‌ని చెప్పారు. ఈ ఫుడ్ బ్యాంక్ నుంచి వృధ్ధులకూ, దివ్యాంగులకూ కూడా భోజనం అందుతోంద‌న్నారు. సిక్కులు ఆరాధించే గురునానక్ దేవ్ గారి బోధనలు అన‌న్య సామాన్య‌మ‌ని కొనియాడారు.

ఎందుకిలా..?

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అనూహ్యంగా సిక్కుల గురించి ప్ర‌స్తావించ‌డం.. వారిని ఆకాశానికి ఎత్తేయ‌డానికి కార‌ణం.. త్వ‌ర‌లోనే పంజాబ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ సిక్కులు అత్యంత కీల‌క రోల్ పోషిస్తున్నారు. 82 శాతంప్ర‌జ‌లు సిక్కులే. దీంతో ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునేందుకు సిక్కుల మ‌ద్ద‌తు ఏ పార్టీకైనా కీల‌కం. ఇప్ప‌టికే పంజాబ్‌లోని ప్రాంతీయ పార్టీ అకాలీదళ్‌తో బీజేపీ చేతులు క‌లిపింది. ఆ పార్టీకే ముఖ్య‌మంత్రిపీఠం కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. కాగా, ప్ర‌స్తుతం పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. సీఎంగా భ‌గ‌వంత్ మాన్‌(సిక్కు) ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోడీ తాజాగా సిక్కుల‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచ్చెత్తార‌ని.. త్యాగ ధ‌నులు అంటూ కీర్తించార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    
  • pmmodi 
  • mannkibaat 
  • sikhcommunity 
  • punjabpolitics 
  • punjabelections 
  • sikhgurus 

Similar News

టీడీపీ వ‌ర్గ‌పోరుతో గ‌న్న‌వ‌రం కుత‌కుత‌!

2026-11-29 16:30 GMT

ఫోన్ కొనాలంటే మరింత ఖర్చు చేయాల్సిందే.. 2027లోనూ పెరగనున్న ధరలు!

2026-11-29 15:51 GMT

110 ఏళ్ల వయసులోనూ ఓటు.. చంద్రబాబు ప్రశంసలు అందుకున్న రాఘవమ్మ!

2026-11-29 15:50 GMT

ఇది చారిత్ర‌క ఘ‌ట్టం.. మిస్‌కావొద్దు: చంద్ర‌బాబు

2026-11-29 15:50 GMT

కేసీఆర్ దీక్ష‌కు 17 ఏళ్లు.. కేటీఆర్ ఏమ‌న్నారంటే!

2026-11-29 15:49 GMT

పంచాయతీ పోలింగ్ ర‌చ్చ‌ర‌చ్చ‌!

2026-11-29 15:49 GMT

పార్ల‌మెంటు సీట్ల సంఖ్యపై కాంగ్రెస్‌ లెక్క ఇదీ!

2026-11-29 15:48 GMT

ప్రపంచంలో గూగుల్ హవా.. ఒక్క నెలలో 7,032 కోట్ల విజిట్స్!

2026-11-29 15:47 GMT

కూతురు పెళ్లిలో అన్నీ మరిచిపోయి కొడుకుతో కలిసి డ్యాన్స్ చేసిన వైఎస్ షర్మిల.. వైరల్

2026-11-29 15:46 GMT

భారత్‌లో మిస్టర్ బీస్ట్ లంబోర్గినికి ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు

2026-11-29 15:45 GMT

మూడు రోజులు ఏపీలోనే మోడీ!

2026-11-29 15:43 GMT

Copyright @2026

Powered by Blink CMS