ఏపీలో కొత్త సర్వే ఫలితాలు...లోకేష్ - పవన్ స్థానాల్లో ఫలితాలివే!

ఎన్నికల సీజన్ వచ్చిందంటే... రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తల సందడితోపాటు ప్రధానంగ సర్వే సంస్థల సందడి కూడా మొదలైపోతుంటుంది

Update: 2024-04-29 05:12 GMT

ఎన్నికల సీజన్ వచ్చిందంటే... రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తల సందడితోపాటు ప్రధానంగ సర్వే సంస్థల సందడి కూడా మొదలైపోతుంటుంది. పైగా... ఇటీవల కాలంలో ఈ సర్వే సంస్థల హల్ చల్ ఎక్కువగానే తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని సర్వే సంస్థల ఫలితాలపై జనాల్లో క్రెడిబిలిటీ ఉండగా.. మరికొన్ని మాత్రం బ్లఫ్ ఫలితాలు ఇస్తుందనే కామెంట్లూ వినిపిస్తుంటాయి!

ఇక, ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికల సీజన్ రాగానే ఇప్పటికే రాష్ట్ర స్థాయిల్లోనూ, జాతీయ స్థాయిల్లో పలు సర్వే సంస్థల నుంచి ఎన్నో ఫలితాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో మెజారిటీ సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రాగా.. మరికొన్ని మాత్రం కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మరో సర్వే తరపైకి వచ్చింది. ఇందులో సంచలన ఫలితాలు తెరపైకి వచ్చాయి.

అవును... 175 నియోజకవర్గాల్లోనూ 90,604 శాంపిల్స్ తో ఏ.ఎల్.ఎన్ (ఆంధ్రా సర్వే న్యూస్) సంస్థ సర్వే ఫలితాలను నియోజకవర్గాల వారీగా వెల్లడించింది. ఇందులో భాగంగా... ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి 51%, టీడీపీ+ కి 41%, కాంగ్రెస్ పార్టీకి 4%, ఇతరులకు 4% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక్కడ టీడీపీ+ అని అంటే... టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అనే సంగతి తెలిసిందే.

ఇక సీట్ల విషయానికొస్తే... అధికార వైసీపీకి 149 స్థానాల్లో విజయం కన్ ఫాం అని చెప్పిన ఈ ఏ.ఎల్.ఎన్. సర్వే... టీడీపీ + బీజేపీ + జనసేన కూటమికి 26 స్థానాలు మాత్రమే వస్తాయని వెల్లడించింది. అంటే... గత ఎన్నికల్లో సాదించిన సీట్ల కంటే 2 తక్కువగా వైసీపీకి, 3 ఎక్కువగా టీడీపీ+ కి వస్తాయని చెప్పిందన్నమాట! ఇదే క్రమంలో... నియోజకవర్గాలు, అక్కడ ఆయా పార్టీలకు వచ్చే మెజార్టీలను కూడా ఈ సంస్థ అంచనా వేసింది.

Read more!

ఇందులో భాగంగా... సీఎం వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆయన గెలుపును కన్ ఫాం చేసిన ఈ సర్వే సంస్థ... ఆయనకు 21000+ మెజార్టీ రావొచ్చని తెలిపింది. ఇదే సమయమో.. కుప్పంలో చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెబుతూ.. 19000+ మెజారిటీ కన్ ఫాం అని వెల్లడించింది.

ఇదే క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలో మరోసారి నారా లోకేష్ కు ఓటమి తప్పదన్నట్లుగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ 2000 ఓట్ల ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అదే విధంగా... పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుమారు 7000+ ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశం ఉందని తెలిపింది. దీంతో... ఈసర్వే ఫలితాలు వైరల్ గా మారాయి!

Tags:    

Similar News