• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ కార్నర్...

పవన్ కార్నర్ అవుతున్నారా...ఎందుకలా ?

| జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఇటీవల కాలంలో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి.

By - Satya P
Update: 2026-07-09 08:02 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఇటీవల కాలంలో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందులో కొన్ని తెచ్చి పెట్టుకున్నవి అయితే మరికొన్ని అనవసరంగా తగులుకున్నవి. విజయవాడ క్రిష్ణ లంకలోని గాదె సాయి క్రిష్ణ కేసు అయితే జనసేనకు కోరి చుట్టబడింది అని అంటున్నారు. ఈ కేసులో నిజానికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదు. ఎందరో పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఎవరేమిటి చేస్తున్నారు అన్నది పార్టీకి పట్టింపు ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. అంతే కాదు ఎవరు ఎలాంటి వారు అన్నది కూడా తెలియదు, తెలిసిన తరువాత దూరం పెడతారు. సాయి క్రిష్ణ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వాడు అని జనసేన దూరం పెట్టింది. అయితే అంతవరకూ ఓకే కానీ ఆయన విషయంలో విపక్షాలు కానీ సోషల్ మీడియా కానీ జనసేనని టార్గెట్ చేసింది. దాంతో పవన్ ఓపెన్ అయిపోయారు. పార్టీ మీటింగులో మాట్లాడుతూ క్రిమినల్స్ కి కులాలు ఏమిటి అన్నారు. ఈ విధంగా పవన్ విపక్షాల ట్రాప్ లోకి చిక్కుకున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో పార్టీగా ఆయన సైలెంట్ గా ఉంటే సరిపోయేదని సూచనలు కూడా వచ్చాయి.

యూట్యూబర్ విషయంలోనూ :

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత పెద్ద అవకాశమో అంతకు మించి పెను శాపంగా మారింది. ముఖ్యంగా సెలిబ్రిటీలకు ఈ ఇబ్బంది తప్పడం లేదు, ఎన్ని రకాల చట్టాలు వచ్చినా మరేమి చేసినా కోట్లలో ఉన్న జనాలను ఈ విషయంలో కట్టడి చేయడం కష్టమే అవుతోంది. వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వారిని అయినా ఎంచుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే తాను పెద్ద వారు కావచ్చు అన్నది వారి ఆలోచన. అందుకే ఇలాంటి వాటి విషయంలో తక్కువగానే రియాక్ట్ కావడమే మేలు అన్న భావన ఉంది. ఇక ఒక మీటింగులో యూట్యూబర్ పవన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. దానితో ఆయనను తీసుకుని వచ్చి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ మీదట కోర్టు బెయిల్ ఇచ్చింది. అక్కడితే ఈ ఇష్యూ వదిలేస్తే పోయేది ఉపా లాంటి చట్టలను ప్రయోగించే దాకా వెళ్ళడం అంటే మరింతగా సమస్యను పెంచుకోవడమే అని అంటున్నారు.

వారిని కట్టడి చేయాల్సిందే :

మరో వైపు చూస్తే యూట్యూబర్ ని తెచ్చిన ప్రతీ పోలీస్ స్టేషన్ వద్ద జనసైనికులు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ ఆందోళనను నిర్వహించడం పోలీస్ స్టేషన్ గోడలు దూకేందుకు ప్రయత్నం చేయడం ఇవన్నీ పార్టీకి చికాకుగానే మారుతున్నాయని అంటున్నారు. ఒక ఇష్యూ మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంటే మధ్యలో పార్టీ క్యాడర్ కి ఏమి పని అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది. ఇలాంటి దుందుడుకు చర్యల మూలంగా పార్టీకే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అంతే కాదు దారిన పోయే బురదను తెచ్చి మీదకు వేసుకున్నట్లు అవుతోంది అంటున్నారు.

వీటి విషయం మరచారా :

ఏపీలో ఇపుడు సర్ పేరుతో ప్రక్రియ సాగుతోంది. టీడీపీ వైసీపీ నేతలు దాని మీద ఫోకస్ పెట్టి ఉన్నారు. తమ సానుభూతిపరుల ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత జనసేనకు ఉంది కదా అంటున్నారు. కార్యకర్తలు ఈ విధంగా వీధులలో వీరంగం వేయడం కంటే స్థానిక ఎన్నికల మీద ద్ర్ష్టి పెట్టడం అలాగే సర్ విషయంలో ఓట్లు పోకుండా చూసుకోవడం వంటివి చేస్తే పార్టీ పటిష్టం అవుతుందని అంటున్నారు. ఇక ఏపీలో జనసేన బలమైన మూడవ పార్టీగా ఎమెర్జ్ అవుతోంది. ఈ క్రమంలో పార్టీ మీద విమర్శలు వస్తూంటాయి. అందులో వేటికి విలువ ఇవ్వాలి వేటిని వదిలేయాలి అన్నది ఆచీ తూచీ తేల్చుకోకపోతే విపక్షాల ట్రాప్ లోనే పడతారు అని అంటున్నారు.

Tags:    
  • pawankalyan 
  • janasena 
  • youtubercontroversy 
  • appolitics 

Similar News

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS