కేటీఆర్ మా బ్రదర్...పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

తెలంగాణాలో అతి పెద్ద సంచలనంగా జనసేన అధినేత పవన్ ప్రెస్ మీట్ సాగిన సంగతి తెలిసిందే.

Update: 2026-06-03 19:19 GMT

తెలంగాణాలో అతి పెద్ద సంచలనంగా జనసేన అధినేత పవన్ ప్రెస్ మీట్ సాగిన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. పవన్ సభకు అనుమతించకపోవడంతో పాటు ఆ హీటూ కూడా తోడు అయి రెండు తెలుగు రాష్ట్రాల జనాలు అంతా టీవీలకు అతుక్కుపోయి మరీ పవన్ ప్రెస్ మీట్ ని తిలకించారు అని అంటున్నారు. పవన్ సైతం దూకుడుగానే మాట్లాడారు. ఆయన మాటలలో ఆవేశం పాళ్ళతో పాటు తర్కాన్ని లేవదీసే పలు ప్రశ్నలు కూడా వెలువడ్డాయి. పవన్ ఆ విధంగా సృష్టించిన రాజకీయ కలకలంతో తెలంగాణాలో ప్రతీ పార్టీ స్పందించాల్సిన అనివార్యత ఏర్పడింది.

కేటీయార్ గట్టిగానే :

ఇక పవన్ ప్రెస్ మీట్ ఇలా ముగిసిందో లేదో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి సహా కీలక నేతలు ఎమ్మెల్సీ అద్దంకి దినకర్ వంటి వారు చాలా ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణా మా అయ్య జాగీరు, మా జాగీరు కూడా అంటూ స్ట్రాంగ్ గా పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణాలో ఏపీ నేతలకు ఏమిటి పని, వారి రాజకీయం అక్కడ చేసుకోవాలని కూడా కోరారు. ఇక హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పవన్ ప్రెస్ మీట్ మీద విలేకరులు అడిగిన ప్రశ్నలకు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తెలంగాణాలో మా రాజకీయం మాకుంది అంటూ మీ రాజకీయం మీరు చూసుకోండి అని కూడా పవన్ కి చెప్పేశారు.

బిర్యానీ పెడతాం కానీ :

పవన్ ని ఏపీ ఉప ముఖ్యమంత్రిగా సినీ నటుడిగా అభిమానిస్తామని మా ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ పెట్టి గౌరవిస్తామని అన్నారు. అంతే తప్ప తెలంగాణా రాజకీయాల్లో వేలు పెట్టి పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదని అన్నారు. సెక్రటరేట్ లో ఆంధ్రా వారు వచ్చి అంతా తామే చూస్తామంటే అసలు ఊరుకునేది లేదని కేటీఆర్ కచ్చితంగా చెప్పేశారు. ఎన్నో దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణాలో హక్కుభుక్తాలు అన్నీ తెలంగాణా భూమి పుత్రులకే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రక్తంతో తడిసిన నేల తెలంగాణా అని ఎన్నో ఉద్యమాలను చూసిందని చెప్పారు. తమకు ఎవరూ నీతి పాఠాలు దేశ భక్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదని పవన్ మీద కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

కేటీఆర్ మీద పాజిటివ్ గా:

అయితే కేటీఆర్ స్మూత్ గా మాట్లాడినా కూడా ఘాటుగానే ఇవ్వాల్సింది ఇచ్చేశారు అని అంటున్నారు. దాని మీద మంగళగిరిలో పవన్ ని ఏపీ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆయన కూడా సాఫ్ట్ గానే రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ తనకు బ్రదర్ అని అన్నారు ఆయనతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. ఆయన ఏమి మాట్లాడారో తాను చూడలేదని పవన్ అంటూ మంచిగానే మాట్లాడి ఉంటారు అని భావిస్తున్నట్లుగా చెప్పారు. మొత్తానికి పవన్ అయితే కేటీఆర్ మీద సోదర ప్రేమ చూపించారు. అలాగే నిన్నటి ప్రెస్ మీట్ లో సైతం కేసీఆర్ గారు అని అంటూ బీఆర్ఎస్ మీద కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. అయితే తెలంగాణా సెంటిమెంట్ విషయంలో బీఆర్ ఎస్ కాంగ్రెస్ తో పాటే అదే విధంగా సౌండ్ చేస్తోంది. కానీ పవన్ మాత్రం కేటీఆర్ ని బ్రదర్ అంటూ లైట్ తీసుకోవడం పట్ల అయితే చర్చ సాగుతోంది.

Tags:    

Similar News