ఆమెకు 70 ఏళ్లు.. కవలలకు తల్లైంది

వయసు అన్నది ఒక అంకె మాత్రమే అని కొందరు చెబుతుంటారు. కానీ.. దాన్ని చాలామంది ఒప్పుకోరు.

Update: 2023-12-02 15:30 GMT

వయసు అన్నది ఒక అంకె మాత్రమే అని కొందరు చెబుతుంటారు. కానీ.. దాన్ని చాలామంది ఒప్పుకోరు. అయితే.. కొన్ని ఉదంతాల్ని చూసినప్పుడు మాత్రం వయసు కేవలం జస్ట్ ఒక నెంబరేమో అన్న భావన కలుగక మానదు. తాజా ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. 70 ఏళ్ల వయసు వచ్చిందంటే.. కాటికి కాళ్లు జాపుకున్నట్లే అన్నట్లుగా చాలామంది మాటలు చెబుతారు. అయితే.. ఈ వయసులోనూ పిల్లల్ని కనొచ్చన్న సందేశాన్ని ప్రపంచానికి చాటిందో పెద్ద వయసు మహిళ.

ఉగాండాకు చెందిన 70 ఏళ్ల సఫీనా నముక్వాయ తాజా సంచలనంగా మారారు. దీనికి కారణం ఆమె ఈ వయసులో తల్లి కావటం. మిగిలిన వారి మాదిరి ఆమెను వృద్ధురాలిగా పేర్కొనటం మాకు ఇష్టం లేదు. పాతికేళ్ల వయసులోనూ వృద్ధుల మాదిరి వ్యవహరించేటోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. అలాంటప్పుడు.. వయసును ప్రాతిపదికగా ఫలానా వారు వృద్ధులుగా పేర్కొనే కన్నా.. అరవై ఏళ్లు దాటిన వారిని పెద్ద వయస్కులుగా పేర్కొనటం గౌరవప్రదంగా ఉంటుందని చెప్పాలి.

ఈ విషయాన్ని ఇలా ఉంచితే.. 70 ఏళ్ల సఫీనా కృత్రిమ పద్దతిలో తల్లైంది. ఆమెకు సిజేరియన్ పద్దతిలో డెలవరీ చేశారు వైద్యులు. తాజాగా ఆమె ఒక బాబు.. పాప పుట్టారు. ఉగాండా రాజధాని కంపాలా నగరంలోని ఒక ఆసుపత్రిలో ఆమెకు డెలివరీ చేశారు. డెలివరీ అనంతరం ఆమె చక్కగా మాట్లాడుతున్నారని.. నడుస్తున్నారని.. ఆరోగ్యంగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మూడేళ్ల క్రితం అంటే 2020లోనూ ఆమె ఐవీఎఫ్ ద్వారా ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. తాజాగా డెలివరీతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసులో కవలలకు జన్మనిచ్చిన రెండో మహిళాగా నిలుస్తారని చెబుతున్నారు. అయితే.. విదేశీ మీడియా మాత్రం ఆమె మొదటి మహిళగా చెబుతున్నారు. 2019లో దక్షిణ భారత దేశానికి చెందిన 73 ఏళ్ల వయసున్న మహిళ కవలలకు జన్మనిచ్చినట్లుగా చెబుతున్నారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఈ ఉదంతం చూసిన తర్వాత.. వయసు అనేది కేవలం ఒక నెంబర్ అని మాత్రమే చెప్పక తప్పదు.

Tags:    

Similar News