నెల్లూరు రూర‌ల్‌.. కోటంరెడ్డి హ‌వాకు బ్రేకుల్లేవా ..!

నెల్లూరు రూరల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానాల్లో ఒకటి.

Update: 2026-09-28 16:30 GMT

నెల్లూరు రూరల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానాల్లో ఒకటి. 2008 డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఏర్పడిన ఈ నియోజకవర్గం, భౌగోళికంగా ఒకే ఒక పూర్తి స్థాయి గ్రామీణ మండలం కాకుండా నెల్లూరు రూరల్ మండలం తో పాటు నెల్లూరు నగర పరిధిలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు, నగర శివారు గ్రామాల కలయికగా ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ నియోజకవర్గ పరిధిలో రెడ్డి, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయం, రొయ్యల సాగు ప్రధాన జీవనాధారమైన ఈ ప్రాంతాల్లో స్థానిక సమస్యలు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటివి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి.పార్టీల బలాబలాలు: ఇక్కడ సంప్రదాయబద్ధంగా వైసీపికి మంచి పట్టు ఉండేది. అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో వైసీపీ నుంచి గెలిచినా 2024 తర్వాత టీడీపీలోకి మారడంతో ఇక్కడి స్థానిక క్యాడర్ కూడా రెండుగా చీలిపోయింది.

తాజా 2024 ఎన్నికల్లో టీడీపీ అనుకూల పవనాలు, కోటంరెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం కూటమి భారీగా ఓట్లను కొల్లగొట్టే ప‌రిస్థితికి చేరింది. నగర శివారు ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్ వార్డులలో కూడా కోటం రెడ్డి దూకుడు క‌నిపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్‌కు 30 వార్డులు ఉన్నాయి. వీటితో పాటు అల్లిపురం (ఓజి), కల్లూర్‌పల్లె (ఓజి), భుజ భుజ నెల్లూరు వంటి అర్బన్ విస్తరణ ప్రాంతాలు ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు 75% ఓటర్లు పట్టణ, సెమీ-అర్బన్ పరిధిలోనే విస్తరించి ఉన్నారు.

ఈ ప్రాంతాల్లో మధ్యతరగతి, వ్యాపార వర్గాలు మరియు వలస ఓటర్ల సంఖ్య ఎక్కువ. నగరానికి ఆనుకుని ఉండటం తో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మున్సిపల్ సమస్యలు ఇక్కడ ప్రధాన ఎజెండాగా మారుతుంటాయి.పార్టీల బలాబలాల ప‌రంగా చూస్తే.. నగర శివారు డివిజన్లలో తెలుగుదేశం పార్టీ కి బలమైన క్యాడర్ ఉంది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డిపై, టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడి పట్టణ డివిజన్లలో భారీ మెజారిటీని సాధించి విజయం ఖరారు చేసుకున్నారు. ఇప్పుడు ఆ గ్రాఫ్ మ‌రింత పెరిగింది. దీంతో కోటంరెడ్డి హ‌వాకు తిరుగులేద‌న్న వాద‌న బలంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News