జియోపాలిటిక్స్ వేదికపై 'మెలోడీ' మ్యాజిక్.. జీ7 సదస్సులో మోదీ-మెలోనీ ఇన్‌స్టాగ్రామ్ హల్‌చల్!

ఒకప్పుడు అంతర్జాతీయ సదస్సులు అంటే సంయుక్త ప్రకటనలు, ద్వైపాక్షిక ఒప్పందాలు మాత్రమే గుర్తుకొచ్చేవి.

Update: 2026-06-16 17:58 GMT

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. అంతర్జాతీయ భద్రత.. యుద్ధాలు.. వాతావరణ మార్పులు... ఇలాంటి అత్యంత గంభీరమైన అంశాలపై చర్చించేందుకు ప్రపంచ అగ్రనేతలంతా జీ7 సదస్సులో సమావేశమయ్యారు. తీవ్రమైన చర్చలు, వ్యూహాత్మక ఒప్పందాలతో కాస్త ఉత్కంఠ భరితంగా సాగే ఈ అంతర్జాతీయ వేదికపై ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. దానికి కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య సాగిన ఒక సరదా సంభాషణ. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీరిద్దరి క్రేజ్ ఇప్పుడు జీ7 సదస్సులోనూ హాట్ టాపిక్‌గా మారింది.

‘మెలోడీ’ బ్రాండ్.. దౌత్యం నుంచి డిజిటల్ స్టార్‌డమ్ వరకు!

గత కొంతకాలంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మెలోనీ + మోదీ #Melodi అనే హ్యాష్‌ట్యాగ్ ఎంతలా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెటిజన్లు సృష్టించిన ఈ ‘రాజకీయ బ్రాండ్’ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇద్దరు నేతలు కలిసిన ప్రతిసారీ దిగే సెల్ఫీలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ వేదికలపై మిలియన్ల కొద్దీ వ్యూస్, లైకులను కొల్లగొడుతున్నాయి.

తాజాగా జీ7 సదస్సులో ప్రధాని మోదీని కలిసిన మెలోనీ, "మిమ్మల్ని మళ్లీ చూడటం చాలా ఆనందంగా ఉంది" అంటూ ఆప్యాయంగా స్వాగతం పలికారు. అయితే ఆ తర్వాత జరిగిన అసలు సిసలైన హైలైట్ అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

మేం ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్!

ప్రధాని మోదీ, మెలోనీ మాట్లాడుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న ఒక ప్రతినిధి సరదాగా జోక్యం చేసుకుంటూ... "ఈ మధ్య కాలంలో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా కనిపిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. దీనికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఏమాత్రం తడుముకోకుండా ముఖంపై పెద్ద నవ్వుతో... "అవును... మేం ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్ " అని బదులిచ్చారు. ఈ వ్యాఖ్య వినగానే పక్కనే ఉన్న ప్రధాని మోదీతో పాటు అక్కడున్న ప్రతినిధులంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. గ్లోబల్ లీడర్స్ మీటింగ్‌లో ద్రవ్యోల్బణం, జియోపాలిటిక్స్ కంటే కూడా ‘రీల్స్ రీచ్’ గురించి చర్చ జరగడం నిజంగా ఒక అరుదైన, ఆహ్లాదకరమైన క్షణంగా నిలిచిపోయింది.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్.. ‘జీ7 కాదు.. ఇది ఐజీ7!’

ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడమే ఆలస్యం, నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్, కామెంట్లతో పండగ చేసుకుంటున్నారు. "ఇకపై దీన్ని జీ7 అనకూడదు... ‘ఐజీ7’ ఇన్‌స్టాగ్రామ్ 7 అనాలి" ఎట్టకేలకు మెలోడీ పార్ట్-2 వచ్చేసింది... సోషల్ మీడియా రికార్డులు బద్దలవ్వడం ఖాయం." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకప్పుడు అంతర్జాతీయ సదస్సులు అంటే సంయుక్త ప్రకటనలు, ద్వైపాక్షిక ఒప్పందాలు మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒక పవర్‌ఫుల్ సెల్ఫీ, ఒక ట్రెండింగ్ రీల్, ఒక చిన్న వైరల్ కామెంట్ చాలు... ప్రపంచ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి..

మొత్తానికి జీ7 సదస్సులో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల సంగతి ఎలా ఉన్నా ‘మెలోడీ’ బ్రాండ్ మాత్రం ఇటు డిజిటల్ ప్రపంచాన్ని.. అటు అంతర్జాతీయ దౌత్యాన్ని మరోసారి షేక్ చేసింది. డిజిటల్ యుగంలో ఇద్దరు గ్లోబల్ లీడర్స్ ఎలా "సూపర్ హిట్ జోడీ"గా మారవచ్చో వీరు నిరూపించారు.

Tags:    

Similar News