కవితక్కకు ఈసీ 'బిగ్ షాక్'.. 'టీఆర్‌ఎస్‌' బోర్డు తిప్పేయాల్సిందేనా?

తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించి, పాత 'టీఆర్‌ఎస్‌' బ్రాండ్‌తో రాజకీయాల్లో రీ-ఎంట్రీ ఇద్దామని ఆమె వేసిన ప్లాన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గట్టి షాకే ఇచ్చింది.

Update: 2026-07-04 06:50 GMT

కొత్త దుకాణం తెరిచి కస్టమర్లను ఆకర్షిద్దామనుకునే లోపే.. మున్సిపాలిటీ వాళ్లు వచ్చి బోర్డు పీకేయమన్నట్టు తయారైంది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత పరిస్థితి. తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించి, పాత 'టీఆర్‌ఎస్‌' బ్రాండ్‌తో రాజకీయాల్లో రీ-ఎంట్రీ ఇద్దామని ఆమె వేసిన ప్లాన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గట్టి షాకే ఇచ్చింది. "ఆ పేరు కుదరదు తల్లి.. పక్షం రోజుల్లో వేరే మూడు పేర్లు పట్టుకుని రా.. లేదంటే దుకాణం బంద్" అంటూ ఈసీ లీగల్ నోటీసు పంపడంతో గులాబీ గూటికి దూరమైన కవితకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది.

పాత పేరు.. కొత్త పంచాయితీ

ఈ ఏడాది ఏప్రిల్‌లో మేడ్చల్ వేదికగా కవితక్క భారీ హంగామా మధ్య "తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌)" అంటూ కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. గులాబీ జెండా కలర్ మార్చి, ఎజెండా మార్చి, ఉద్యమ వారసత్వం నాదే అంటూ ఈసీ దగ్గరికి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారు. అయితే అక్కడ అసలు కథ మొదలైంది."తెలంగాణ రక్షణ సేన"ని కాస్త "భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)"గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న సొంత అన్న కేటీఆర్, సారు కార్లకు ఈ పేరు మార్పు వ్యవహారం అస్సలు నచ్చలేదు. పల్లెల్లో జనాలు ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ను 'టీఆర్‌ఎస్‌' అనే పిలుస్తున్నారని, ఇప్పుడు కవితమ్మకు అదే పేరు ఇస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అయి తమ కారు గుర్తుకు కాకుండా ఆమెకు ఓటేస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు ఈసీ మెట్లెక్కారు.

ట్విస్ట్ ఏంటంటే.. కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమే కాదు..

మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఒక సంస్థతో పాటు, జూన్ నెలలోనే దాదాపు 600 నుంచి 700 వరకు ఫిర్యాదులు ఈసీకి అందాయట! 'టీఆర్‌ఎస్‌' అనే పేరు మీద ఇంతమందికి ప్రేమ ఉందా అని పొలిటికల్ సర్కిల్స్ ముక్కున వేలేసుకుంటున్నాయి.

ఈసీ అల్టిమేటం.. 15 రోజులే టైమ్

ఈ ఫిర్యాదుల వెల్లువను చూసిన ఎన్నికల సంఘం.. "ఈ పేరుతో రిజిస్ట్రేషన్ ఇస్తే తగాదాలు తప్పవు" అని ఫిక్స్ అయిపోయింది. అందుకే కవితకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ లేఖ పంపింది. 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సబ్మిట్ చేయాలి. గడువులోగా కొత్త పేర్లు ఇవ్వకపోతే.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అప్లికేషన్‌ను డస్ట్‌బిన్‌లో పారేస్తాం అని సమాచారం పంపంది..

ఇప్పుడు కవితమ్మ రూట్ ఎటు?

రాజకీయంగా తనకంటూ ఓ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న కవితకు, మొదటి అడుగులోనే ఈసీ పెట్టిన బ్రేక్ పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పుడు ఆమె ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. సద్దుమణిగి కొత్త పేరు వెతుక్కోవడం.. ఈసీ చెప్పినట్టు వినేసి 'టీఆర్‌ఎస్‌' ఆశలు వదిలేసి వేరే ఏదైనా పేరు చూసుకోవడం మొదటి ఛాయిస్.. ఇక రెండో ఛాయిస్ కోర్టు మెట్లెక్కడం.. "టీఆర్‌ఎస్‌ అనేది ఎవరి అబ్బసొత్తు కాదు, నేను లీగల్‌గా ఫైట్ చేస్తా" అని కోర్టుకు వెళ్లడం మరో అవకాశం.

ఏదేమైనా అన్నతో పోటీ పడదామనుకున్న కవితమ్మకు ఈసీ ఇచ్చిన షాక్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి రానున్న రోజుల్లో ఆమె 'సరెండర్' అవుతారా లేక 'సమరానికి' సై అంటారా అనేది చూడాలి.

Tags:    

Similar News