'సేనా గళం' జనసేనకు ఊపిరి.. !
పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉన్న పాజిటివిటీ తెలుసుకునేందుకు అనేక మార్గాలు ఉంటాయి.అయితే ఒక్కొక్కసారి ఇవి సరైన విధంగా ఫీడ్ బ్యాక్ ఇస్తున్నాయా? లేదా? అనేది ప్రశ్నగా మారుతుంది.
పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉన్న పాజిటివిటీ తెలుసుకునేందుకు అనేక మార్గాలు ఉంటాయి.అయితే ఒక్కొక్కసారి ఇవి సరైన విధంగా ఫీడ్ బ్యాక్ ఇస్తున్నాయా? లేదా? అనేది ప్రశ్నగా మారుతుంది. అందుకే.. పార్టీలు ఒక్కొక్కసారి విఫలమవుతున్నాయి. వైసీపీ లో గతంలో భజన పరులు పెరిగిపోయారు. దీంతో ఇంకేముంది.. 151స్థానాలు కాదు.. వైనాట్ 175 అనే నినాదం పార్టీలో వినిపించింది. కానీ.. వాస్తవాన్ని పార్టీ గ్రహించే సరికే.. పుణ్య కాలం పూర్తయింది.
ఫలితంగా ప్రజల నాడిని పట్టుకునే విషయంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారన్నవాదన ఉంది. దీనికి కారణం.. తాను ఎవరి నుంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నారో.. వారే తప్పు చేశారన్నది వైసీపీలో వినిపించే వాదన. ఇలాంటి తప్పులు, పొరపాట్లకు కారణం.. నమ్మిన బంట్లేనని కూడా అంటారు. జగన్‌కు కోపం రాకుండా.. పార్టీ సూపర్‌గా ఉందని `వీరు` ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. దీంతో ప్రజల వ్యతిరేకతను పార్టీ అంచనా వేయలేక పోయింది.
ఈ నేపథ్యంలో జనసేన ఇప్పుడు `సేనా గళం` పేరుతో ప్రత్యేక వింగ్‌ను తీసుకువచ్చింది. తాజాగా విధి విధానాలు.. ఏం చేయాలన్న అంశాలపైసుదీర్ఘంగా పార్టీ వివరణ ఇచ్చింది. ఒక్కొక్క పార్లమెంటు స్థానం నుంచి ఒక్కొక్క కమిటీని సేనాగళంగా ఏర్పాటు చేస్తారు. ఈ సేనలో 28 మంది సభ్యులు ఉంటారు. అయితే.. వీరి పని.. క్షేత్రస్థాయిలో పర్యటించడమే. ప్రజలు ఏమనుకుంటున్నారు? జనసేనకు ఉన్న ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి? అనే విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది.
వీరిని నేరుగా ఇతర పదవుల్లోకితీసుకోరు. పైగా.. వీరికి టికెట్లు కూడా ఇస్తామని చెప్పలేదు.కానీ, సేనాగళా నికి పార్టీ నుంచి కొంత మేరకు పారితోషికం ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. తద్వారా వారు.. ప్రజల మధ్యకు వెళ్లి.. పార్టీని డెవలప్ చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలి. అంతేకాదు.. ప్రజలు-పార్టీ మధ్య ఉన్న గ్యాప్ ఎంత? దానిని ఏవిధంగా భర్తీచేయాలి? అనే కీలక సూచనలు కూడా చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత పెరగకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుందని జనసేనాని అంచనా వేస్తున్నారు. సో.. ఇతమిత్థంగా సేనా దళం.. పార్టీకి వెన్నుదన్నుగా మారనుంది.