రోడ్డున ప‌డుతున్నారు.. జ‌న‌సేన‌కు లాభ‌మెంత‌..!

జ‌న‌సేన ప‌రిస్థితి హైక‌మాండ్ ద‌గ్గ‌ర ఒక‌లా ఉంటే.. క్షేత్ర‌స్థాయిలో మ‌రోలా ఉండ‌డం ఆ పార్టీకి కూడా శ్రేయ స్క‌రం కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తోంది.

Update: 2026-07-10 09:30 GMT

జ‌న‌సేన ప‌రిస్థితి హైక‌మాండ్ ద‌గ్గ‌ర ఒక‌లా ఉంటే.. క్షేత్ర‌స్థాయిలో మ‌రోలా ఉండ‌డం ఆ పార్టీకి కూడా శ్రేయస్క‌రం కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తోంది. పార్టీని డెవ‌ల‌ప్ చేయాల‌ని.. రానున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకునేలా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌న‌సేన అధినేత పిలుపునిస్తు న్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డి క‌క్క‌డ నాయ‌కులు ఎవ‌రికి వారు త‌మ పంతం నెగ్గించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

చిత్రం ఏంటంటే.. టీడీపీ నాయ‌కులు-వైసీపీ నాయ‌కుల మ‌ధ్య వివాదాల‌తో పోలిస్తే.. జ‌న‌సేన‌లో సొంత నేత‌ల‌పైనే వివాదాలు వ‌స్తున్నాయి. ఒక‌రిపై ఒక‌రు కీచులాడుకునే ప‌రిస్థితి.. అనంత‌రం కేసులు పెట్టుకు నే ప‌రిస్తితి కూడా వ‌స్తోంది. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఓ ఎమ్మెల్యేపై పార్టీ నాయ‌కులు.. ఫిర్యాదు లు చేస్తున్నారు. అలానే.. పోల‌వ‌రం ఎమ్మెల్యే కుటుంబంపై సొంత నేత చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి.

ఉత్త‌రాంధ్ర‌లో కూడా జ‌న‌సేన ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. జ‌న‌సేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లోనే అంత‌ర్గ‌త వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌క‌పోవ‌డం.. ఒక‌రిపై మ‌రొక‌రు ఫిర్యాదులు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయ‌కులు.. ఓ ఎమ్మెల్యేపై ఫిర్యాదులు చేయ‌డం ఈ ప‌రంప‌ర‌లో భాగంగానే చూడాలి. అలాగే.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. సొంత నేత‌ల‌పై చిరాకు ప్ర‌ద‌ర్శించే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి కార‌ణం.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతుండ‌డ‌మే.

ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన ఎమ్మెల్యేలు స‌గానికి పైగా వివాదాల్లోనే చిక్కుకున్నారు. ఈ వివాదాలు పొరుగు పార్టీల‌ నుంచి వ‌స్తే.. రాజ‌కీయంగా ఎదుర్కొనేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ.. సొంత నేత‌ల నుంచి వివాదాలు రావ‌డం.. విమ‌ర్శ‌లు చోటు చేసుకోవ‌డం వంటివి గ‌మ‌నిస్తే.. ఈ ప‌రిణామాలు ఎటు దారితీస్తాయ‌న్న‌ది ప్ర‌ధాన చ‌ర్చ‌. ఇప్ప‌టికైనా ఎమ్మెల్యేలు వాస్త‌వాల‌ను గ్ర‌హించి.. స‌ర్దుకు పోయే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించాలి. కానీ, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వ‌డం.. సంస్థాగ‌తంగా పార్టీలో ఉన్న‌వారిని దూరం పెట్ట‌డం వంటివి త‌గ్గించాలి.

Tags:    

Similar News